అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో..ఒక్కడే 498 రన్స్‌‌‌‌‌‌‌‌

గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన 18 ఏండ్ల యంగ్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్రోణ దేశాయ్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 498 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి ఔరా అనిపించాడు. గుజరాత్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ క్రికెట్ అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్న దివాన్‌‌‌‌‌‌‌‌ బల్లుభాయి కప్‌‌‌‌‌‌‌‌ మల్టీ డే టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో తన స్కూల్‌‌‌‌‌‌‌‌ సెయింట్ జేవియర్స్‌‌‌‌‌‌‌‌ తరఫున జేఎల్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిష్ స్కూల్‌‌‌‌‌‌‌‌పై ద్రోణ 320 బాల్స్‌‌‌‌‌‌‌‌లో  ఏడు సిక్సర్లు, 86 ఫోర్ల సాయంతో భారీ స్కోరు చేశాడు. 

అయితే, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్కోరు బోర్డు లేకపోవడంతో తాను 500 రన్స్‌‌‌‌‌‌‌‌ ముంగిట ఉన్నానని తెలియక ద్రోణ షాట్ ఆడి ఔటయ్యాడు.  అయినప్పటికీ స్కూల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక రన్స్ చేసిన ఆరో బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు. ముంబైకి చెందిన ప్రణవ్‌‌‌‌‌‌‌‌ ధనవాడే (1009 నాటౌట్), పృథ్వీ షా (546), వావెవాలా (515), చలామన్‌‌‌‌‌‌‌‌లాల్ (506 నాటౌట్‌‌‌‌‌‌‌‌), అర్మాన్‌‌‌‌‌‌‌‌ జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (498) ఒక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక రన్స్ చేసిన వారిలో  ముందున్నారు.