- గట్టిగా అరవడంతో హత్య.. నిందితుడి అరెస్ట్
అహ్మదాబాద్/చెన్నై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఆరేండ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. చిన్నారి అరవడంతో హత్య చేశాడు. గుజరాత్ లోని దాహాద్ జిల్లా పిపాలియాలోని ఓ స్కూల్ లో బాధిత బాలిక ఫస్ట్ క్లాస్ చదువుతోంది. గురువారం చిన్నారి స్కూల్ కు వస్తుండగా అదే స్కూల్ ప్రన్సిపాల్ గోవింద్ నాథ్ కారులో ఎక్కించుకుని, లైంగిక దాడికి ప్రయత్నించాడు.
బాలిక గట్టిగా అరవడంతో నోరు, ముక్కు మూసేశాడు. చిన్నారి చనిపోవడంతో డెడ్ బాడీని డిక్కీలో దాచి తీస్కెళ్లి, స్కూల్ కాంపౌండ్ లో పడేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రిన్సిపాల్ ను హంతకుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, తమిళనాడులోని దిండిగల్ జిల్లా తేనిలో ఓ నర్సింగ్ స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.