జామ చెట్టుకు యాపిల్ పండు కాస్తే ఎలా ఉంటుంది? చింత చెట్టుకు మందార ఆకులు వస్తేఎలా ఉంటుంది? ఏంటి ఈ వింత పోకడలు ఆశ్చర్యపోకండి. ఒక చెట్టుకే రెండు, మూడు రకాల పండ్లు వస్తే లాభమెక్కువ కదా. అందుకే సైంటిస్ట్ లు ఎప్పుడో గ్రాఫ్టింగ్ అనే పద్ధతిని కనిపెట్టారు. మరి దాన్ని ఎంతమంది? ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలియదు కానీ, ఆ మెథడ్ వాడి ఒకతను గిన్నిస్ బుక్కు ఎక్కాడు.
ఆస్ట్రేలియాలో ఉండే హుస్సామ్ సరఫ్ 9 కి మొక్కలు పెంచడమంటే ఇష్టం. పోయిన నెల అక్టోబర్ ఆరో తేదీన ప్లమ్, ఆప్రికాట్, ఆల్మండ్, పీచ్, చెర్రీ ఇలా... మొత్తం ఐదు రకాల పండ్ల మొక్కల్ని గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అంటుకట్టాడు. అయితే వెరైటీ కోసమో, ఒకేసారి అన్నింటిని తినొచ్చనో, లేదా రికార్డుకెక్కాలనో అలా చేశాడనుకుంటే పొరపాటు. ఈ హుస్సామ్ ఆలోచన వెనక వేరే కారణముంది. అదే పీస్ ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. అంటే ఈ చెట్ల రంగులు, ఆకారాలు, వాటికి కాసే ఆకులు, పండ్లు అన్నీ వేరు వేరు.
కానీ, అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి పెరిగాయి. అలాగే సొసైటీలో మనుషులంతా కలిసిమెలసి ఉండాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. క్షమించే గుణం ఉండాలి. చివరిగా చెట్టు కాండం.... ఇది తల్లితో సమానం. వేరుగా ఉన్నవాటన్నింటినీ కలిపేది ఇదే. అందుకే డైవర్సిటీ ఇన్ సొసైటీ అనే కాన్సెప్ట్ కనిపించే విధంగా ఇలా చేశాడట హుస్సామ్. ఆ ఐడియా ఇప్పుడు రికార్డు ఎక్కించేసింది.