ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తా : గుగులోత్​ జగన్

నెల్లికుదురు, వెలుగు : తన తల్లిదండ్రులు గుగులోత్ కౌసల్య, లక్ష్మణ్​ పేరుతో జీకేఎల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, పుట్టి, పెరిగిన గ్రామంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కూడా సేవలు అందిస్తానని సంస్థ వ్యవస్థాపకుడు గుగులోత్​ జగన్ ​తెలిపారు. నెల్లికుదురు మండలం రత్తిరాం తండాకు చెందిన ఆయన ఆదివారం గ్రామంలో జీకేఎల్​ ఫౌండేషన్​ను ప్రారంభించారు. అనంతరం ఉచిత వైద్యం, కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన మహబూబాబాద్​ డీఎంహెచ్​వో మురళీధర్ తోపాటు పలువురు పెద్దలు మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ఫౌండేషన్ ప్రారంభించిన జగన్​ను అభినందించారు.

అనంతరం ఫౌండేషన్ వ్యవస్థపకుడు జగన్ మాట్లాడుతూ విద్యార్థులకు తనవంతు సహకారన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో నెల్లికుదురు ఏఎస్సై గుంటుక యాకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ గవర్నమెంట్ అఫ్ ఇండియా డాక్టర్ పందిరి అంజయ్య, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ కృష్ణమూర్తి, నెల్లికుదురు సొసైటీ వైస్ చైర్మన్ గుగులోత్ టాన్సింగ్, గుగులోత్ శ్యాం సుందర్, గుగులోత్ జాదు నాయక్ తదితరులు పాల్గొన్నారు.