తెలంగాణలో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్​..10 నుంచి వెబ్​సైట్​లో హాల్ టికెట్లు

  • నవంబర్ 10 నుంచి వెబ్​సైట్​లో హాల్ టికెట్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా 1,380 పోస్టుల భర్తీకి జరిగే గ్రూప్ 3 పరీక్షలు నవంబర్17, 18 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు చేస్తున్నది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్10న కమిషన్​ వెబ్ సైట్​లో పెడ్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.  

హాల్ టికెట్ డౌన్​లోడ్​లో ఏమైనా సమస్యలు ఏర్పడితే.. టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్​డెస్క్ 040–23542185, 040–23542187 నంబర్లకు కాల్ చేయాలని లేదా హెల్ప్​డెస్క్​కు మెయిల్ చేయాలని నవీన్ నికోలస్ సూచిం చారు. నవంబర్ 17న రెండు పరీక్షలు ఉంటా యని.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1,  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 కొనసాగుతాయని వెల్లడించారు.

రెండో రోజు నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 3 ఎగ్జామ్ ఉం టుందని చెప్పారు. పరీక్ష టైంకు గంటన్నర ముందే సెంటర్​​లోకి అభ్యర్థులను అనుమతిస్తామని, అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్​తో పాటు, క్వశ్చన్ పేపర్లను సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు.