నిమిషం లేటైనా నో ఎంట్రీ..గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రెండురోజులపాటు ఎగ్జామ్స్ జరగనుండగా, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లకు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు సూచనలు చేశారు. సోమవారం పేపర్ 1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు, పేపర్ 2  మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, మంగళవారం పేపర్ 3 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. 

నిజామాబాద్​లో 63, కామారెడ్డిలో 19 సెంటర్లు

నిజామాబాద్​ జిల్లాలో మొత్తం 19,854 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్​కు అటెండ్​ కానుండగా, 63 సెంటర్లు వారి కోసం రెడీగా పెట్టామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో  8,085 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, 19 సెంటర్లు ఏర్పాటు చేశారు. 19 మంది చీఫ్​ సూపరిండెంట్లు, 19 మంది అబ్జర్వర్లు,  ఒక స్పెషల్​ఆఫీసర్,  నలుగురు రూట్​ఆఫీసర్లు, 63 మంది బయోమెట్రిక్​ సిబ్బంది,  9 మంది ఫ్లయింగ్​స్వ్కాడ్, 360 మంది ఇన్విజిలెటర్లు,100 మంది పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది ఎగ్జామ్​ నిర్వహణలో ఉంటారు.  అభ్యర్థుల కోసం ఆర్టీసీ ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 

అభ్యర్థులకు సూచనలివీ..

ఉదయం జరిగే పరీక్షకు 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1.30 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లొద్దు. తమ వెంట పరీక్ష హాల్ టికెట్, బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి. ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. హాల్​టికెట్​పై కలర్ పాస్​ఫొటో అతికించాలి