కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

  • రెండోరోజు తగ్గిన అటెండెన్స్​ 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల్లో 26,977 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా మొదటిరోజు 13,273 మంది హాజరయ్యారు. రెండో రోజు ఉదయం 12,930 మంది, మధ్యాహ్నం 12,922 మంది పరీక్షలు రాశారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్ట్రాంగ్ రూమ్ ఇన్‌‌చార్జి పవన్ కుమార్, డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ విజయ్ కుమార్, ఆర్ఐ సురేశ్‌‌ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ సీలు తీశారు. రీజనల్ కోఆర్డినేటర్లు వరలక్ష్మి , సతీష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్​ కాళి చరణ్ తదితరులు పాల్గొన్నారు. 


పెద్దపల్లి, వెలుగు: రెండు రోజులపాటు జరిగిన గ్రూప్​ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పెద్దపల్లి అడిషనల్​కలెక్టర్​ అరుణశ్రీ తెలిపారు. జిల్లాలోని 18 పరీక్ష కేంద్రాల్లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 9,018 మంది అభ్యర్థులకు గానూ ఉదయం సెషన్ కి  4,349 మంది హాజరు కాగా, 4669 మంది అభ్యర్థులు గైర్జాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 4,346  మంది అభ్యర్థులు హాజరు కాగా, 4,672 మంది ఆబ్సెంట్‌‌ అయ్యారని పేర్కొన్నారు.

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా 35 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్​ 2 పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 10,907 మంది హాజరు కావలసి ఉండగా, మొదటిరోజు ఉదయం 5,274(47.35శాతం), సెకండ్‌‌ పేపర్‌‌‌‌కు 5,222  మంది హాజరయ్యారు. రెండో రోజు ఉదయం 5,164 మంది(47.35శాతం)హాజరుకాగా, నాలుగో పేపర్‌‌‌‌కు 5,155(47.26శాతం) మంది హాజరయ్యారు. జగిత్యాలలో జిల్లాలో మొదటి రోజు 48.35 శాతం నమోదవగా,  రెండో రోజు 47.26 శాతం మంది హాజరయ్యారు. 

రాజన్నజిల్లాలో 49 శాతం మంది హాజరు

రాజన్న సిరిసిల్ల,వెలుగు; రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు 49 శాతం మంది హాజరైనట్లు అడిషనల్‌‌ కలెక్టర్‌‌‌‌ ఖీమ్యానాయక్‌‌ తెలిపారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 7163 మందికి 3,557 మంది ఎగ్జామ్‌‌ రాశారు.