గ్రూప్​ 2, 3 పోస్టులు పెంచాలి

ఆర్మూర్, వెలుగు : గ్రూప్ 2, 3 అభ్యర్థుల పోస్టుల సంఖ్యను పెంచాలని శనివారం గ్రూప్​ 2, 3 అభ్యర్థులు ఆర్డీవో ఆఫీస్​ఏవో శ్రీకాంత్‌‌ను కలిసి మెమోరాండం అందజేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ..  గ్రూప్ 2 పోస్టులు1000,

 గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను 2000 వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా గ్రూప్ 2 ,3 పోస్టుల సంఖ్యను పెంచడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.