ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్

–కరీంనగర్/ రాజన్నసిరిసిల్ల/జగిత్యాల/పెద్దపల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గ్రూప్‌‌  1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌‌  ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎగ్జామ్‌‌  సెంటర్లలో  అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. ఎగ్జామ్​ సెంటర్‌‌ ‌‌ లో అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 36 ఎగ్జామ్‌‌  సెంటర్లను ఏర్పాటు చేశారు. 18,663 మందిగానూ 14,577 మంది హాజరుకాగా, 4086 మంది గైర్హాజరైనట్లు అడిషనల్‌‌  కలెక్టర్‌‌ ‌‌  ప్రఫుల్ దేశాయ్‌‌  తెలిపారు.

 రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4,699 మందికి గానూ 3,780 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు సెంటర్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్‌‌ కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో గ్రూప్ 1 ఎగ్జామ్‌‌  ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. 6098 అభ్యర్థులకు గానూ 4,737(78శాతం) మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు.  

జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సెంటర్లలో 7,692 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 6,057 హాజరయ్యారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అడిషనల్‌‌  కలెక్టర్‌‌ ‌‌  దివాకర, అడిషనల్‌‌  ఎస్పీ వినోద్ కుమార్‌‌ ‌‌ ను నియమించారు.