గ్రూప్-1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగొచ్చిన అధికారి

–గ్రూప్-1 పరీక్ష డ్యూటీకి  మద్యం తాగి వచ్చిన  అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరుగుతున్న గ్రూప్ 1 పరీక్షకు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ గా  విధులు నిర్వహిస్తున్నాడు పర్వేజ్. అయితే పర్వేజ్  మద్యం తాగినట్లుగా గుర్తించిన పోలీసులు  పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.  బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా అతనికి అందులో 170% రీడింగ్ వచ్చింది.  

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా  గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం అయ్యింది.  ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనుంది. మొత్తం 563 గ్రూప్ 1పోస్టుల కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు అధికారులు. ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే పకడ్బంది ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది కమిషన్. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల దగ్గరికి అభ్యర్థులు చేరుకున్నారు.