బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు

కరీంనగర్ సిటీ, వెలుగు: గ్రూప్​1 మెయిన్స్‌‌ కు 1: 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌‌ ను గ్రూప్‌‌  1 అభ్యర్థులు కోరారు. గురువారం కరీంనగర్‌‌ ‌‌ లోని బండి సంజయ్‌‌ ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు సార్లు గ్రూప్​ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేశారని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని  హామీ ఇచ్చి6 నెలలైనా పట్టించుకోవడం లేదని వాపోయారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం కరీంనగర్ లోని ఈనాడు యూనిట్ఆఫీస్​లో సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావుకు నివాళి అర్పించారు. 

దేవాలయల్లో పూజలు..

కరీంనగర్ లోని పాతబజారు శివాలయాన్ని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబజారు ప్రజలు ఆయనను గజమాలతో సత్కరించారు. అనంతరం గంజ్ వరసిద్ధి వినాయక దేవాలయం, కమాన్ దగ్గర వద్ద రామేశ్వరాలయంలో పూజలు చేశారు.