పెళ్లి ముహూర్తానికి వరదలు.. పెళ్లికొడుకు, కూతురిని ఎత్తుకుని వచ్చారు..!

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు.. పెద్దలు.. ఇప్పుడు సోషల్​ మీడియా యుగంలో  పెళ్లి వీడియోలు వైరల్​గా మారుతున్నాయి.  ఏదో ఒక కొత్త ఒరవడిని సృష్టించడం .. దానిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్​ లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన ఓ వివాహం సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. .. వివరాల్లోకి వెళ్తే..

పెళ్లికొడుకు వివాహ వేదికలో రావడం పెళ్లిలో ఒక ముఖ్యమైన ఘట్టం..  బెల్హా గ్రామంలో జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు  తన బావమరిది భుజాలపై కూర్చొని వచ్చాడు.  అంతేకాదు ఈ పెళ్లి వర్షపు వరదలో జరిగింది.  ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల కారణంగా బెల్హా గ్రామం వరద నీటిలో చిక్కుకుపోయింది.  అయినా సరే ఎలాగైనా పెళ్లి జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకోవడంతో వరుడిని  .. కాబోయే బావమరిది భుజాలపై కూర్చోబెట్టుకొని తీసుకువచ్చాడు.  ఈ వీడియో నెటిజన్లకు ఫన్నీగా ఉంది.  అలానే పెళ్లికూతురిని ఎత్తుకు రావలసిన పరిస్థితి ఏర్పడింది.

వరుడి  బెల్హా సిక్తిహా గ్రామానికి చెందిన దుర్గేష్ కుమార్ కుమారుడు పేరు రామ్ నివాస్​​.  వరుడు తన పెళ్లి కోసం టికునియా నగర్ పంచాయతీలోని బార్సోలా గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది.దాదాపు మూడు రోజులుగా బెల్హా గ్రామం నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు స్థంభించాయి.   గ్రామస్థులు ఈ ప్రాంతంలో తిరిగేందుకు ట్రాక్టర్లు..  పడవలను ఉపయోగిస్తున్నారు.  దీంతో వరుడు రామ్ నివాస్​​ ను తన బావమరిది రామ్​ కుమార్​ భుజాలపై మోస్తూ  బారాత్‌ ఊరేగింపు చేశారు. అలా బావమరిది భుజాలపై బావగారు ఎంజాయి చేశారు.