యు.కె.లో హాస్పిటాలిటీ సెక్టార్లో1.3 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ విడుదలవుతున్నట్టు ఒక నివేదికలో వెల్లడైంది. దాంతో ఆ దేశంలోని కొన్ని హోటల్స్ ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించేందుకు ఏం చేయొచ్చు అని ఆలోచించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇంగ్లండ్ బాన్మత్ టౌన్లో ఉన్న ‘గ్రీన్ హౌస్’ హోటల్‌ను పర్యావరణ ఫ్రెండ్లీగా మార్చేశారు.
అందుకోసం ఆ హోటల్ వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాడు హోటల్ మేనేజర్ నీల్ కార్టర్. ‘‘కార్బన్ ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల) విడుదలను తగ్గించేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. అలానే మా గ్రీన్ హౌస్ హోటల్లో సోలార్ పానెల్స్ ఇన్స్టాల్ చేశాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. లాండ్రీ కోసం ఓజోన్ గ్యాస్ వాడుతున్నాం.
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక పర్యావరణానికి సంబంధించిన కొన్ని లెక్కలు ఇవి. యు.కె.లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీనుంచి కర్బన ఉద్గారాలు ఏడాదికి ఎనిమిది మిలియన్ల టన్నులు విడుదల అవుతున్నాయి అని ఆ లెక్కలు చెప్తున్నాయి. అందుకని కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
32 గదుల ఈ హోటల్ బాన్మత్ టౌన్‌లోని గ్రోవ్ రోడ్లో, గ్రేడ్ 4 విక్టోరియన్ విల్లాలో ఉంది. తిండి, నిద్ర, అంతెందుకు శ్వాసించే గాలి కూడా బాగుండాలని 2010లో దీన్ని పునరుద్ధరించాం. అందులో భాగంగా ఎనర్జీ వాడకం తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశాం. అలాగే హీట్, పవర్ యూనిట్స్ కలిపి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సెన్సర్ ట్యాప్స్, షవర్ హెడ్స్ ఉన్నాయి. వాటివల్ల 25శాతం నీటి వినియోగం తగ్గింది. ఇంటెలిజెంట్ సెన్సర్స్‌తో లెడ్ లైటింగ్, లోకల్‌గా దొరికే చెక్కతో ఫర్నిచర్ తయారుచేయించాం. లాండ్రీలో ఓజోన్ గ్యాస్ వాడుతున్నాం. దీనివల్ల వాష్ సైకిల్స్ 15డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో తిరుగుతాయి.
కిచెన్‌లో ఇండక్షన్ బర్నర్స్ వాడతాం. వేస్ట్ ఫుడ్‌ను ఎనరోబిక్ డైజెస్టర్‌కు పంపిస్తున్నాం. ఈ ప్రాసెస్‌లో బయోవేస్ట్ ద్వారా బయో గ్యాస్ తయారవుతుంది. ఇలా కర్బన ఉద్గారాల విడుదల తగ్గించేందుకు పలు రకాల టెక్నిక్స్ వాడుతున్నాం. కార్బన్ ట్రస్ట్ విడుదలచేసిన నివేదిక ప్రకారం యు.కె. హాస్పిటాలిటీ సెక్టార్లో ఒక ఏడాదికి అయ్యే ఎనర్జీ కాస్ట్1.3 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ.
దాని ఫలితంగా ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్‌లో చాలావరకు పాత బిల్డింగ్స్‌లో ఉన్నాయి. వాటిలో హీటింగ్, లైటింగ్, హాట్ వాటర్, క్యాటరింగ్ వంటి వాటికోసం ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారని ఆ ట్రస్ట్ అభిప్రాయపడింది కూడా.
యు.కె. హాస్పిటాలిటీ సెక్టార్లో ఎనర్జీ సేవింగ్ చేయాలంటే వాడకాన్ని తగ్గించాలి. అలా తగ్గిస్తే 10 నుంచి 40 శాతం వరకు ప్రభావం ఉంటుంది. రిసార్ట్‌ల్లో ఒక రాత్రి స్టే చేసే వాళ్లు ఏడాదికి ఒక మిలియన్ మంది ఉంటున్నారు. బీసీపీ కౌన్సిల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ మీద టూరిజం ఎఫెక్ట్ అనే విషయంపై పనిచేస్తోంది.
అందులోభాగంగా సస్టెయినబుల్ ట్రాన్స్పోర్ట్, వేస్టేజ్ అనే విషయాల మీద దృష్టి పెట్టింది. పర్యావరణం బాగు కోసం మేం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మా కంటే ఇంకా బాగా ఈ విషయంలో ట్రై చేస్తున్న హోటల్స్ ఇంకా చాలా ఉన్నాయి” అన్నాడు.