అవీ-‌‌ – ఇవీ : ది గ్రేట్ బర్డ్​

ది గ్రేట్ క్రెస్టెడ్ గ్రెబ్– ఇది ఓ పక్షి పేరు. పేరులోనే కాదు.. ప్రపంచంలోనే ది గ్రేట్​ అనిపించుకున్న పక్షి జాతి ఇది. ఎన్విరాన్​మెంటల్​ ఆర్గనైజేషన్​ ఫారెస్ట్​ అండ్ బర్డ్స్ సెంటెనరీ ‘బర్డ్ ఆఫ్ ది ఇయర్’ అనే​ కాంపిటీషన్​ను ప్రతి ఏడూ జరుపుతుంది. ఆ కాంపిటీషన్​ పేరును ఇప్పుడు బిల్డ్​ బర్డ్​ ఆఫ్​ ది సెంచరీ 2023గా  మార్చారు.  ప్రాంతీయంగా ఉండే పక్షులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి నలుగురిలో అవగాహన పెంచడం దీని లక్ష్యం.

ప్రతి ఏటా జరిగే ఈ వార్షికోత్సవాల్లో ఈసారి న్యూజిలాండ్​కి చెందిన ది గ్రేట్ క్రెస్టెడ్ గ్రెబ్​ పక్షులు విన్​ అయ్యాయి. ఇవి దాదాపు350 వేల ఓట్లతో గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాయి. వీటిని గెలిపించేందుకు వాటి తరఫున అమెరికన్ –బ్రిటిష్​ కమెడియన్ జాన్ ఒలీవర్​ క్యాంపెయిన్​ కూడా చేశాడు. అంత స్పెసల్​ ఏంటి ఈ పక్షులకు అనిపిస్తుంది కదా. అదే తెలుసుకుందాం పదండి. 

న్యూజిలాండ్​కి చెందిన ది గ్రేట్ క్రెస్టెడ్ గ్రెబ్​ పక్షిని కామన్​గా ఆస్ట్రలేసియన్ క్రెస్టెడ్​ గ్రెబ్​, పుటెకెటెకె అనే పేర్లతో పిలుస్తారు. గ్రెబ్ అనే పదం లాటిన్​ భాష నుంచి వచ్చింది. గ్రెబ్అంటే ‘పోడిలింబస్’​ అని అర్థం వస్తుంది. అంటే.. కాళ్లు శరీరం వెనక భాగంలో ఉంటాయి. ఈ పక్షుల కాళ్లు నడుము ప్రాంతంలో కాకుండా ఇంకాస్త వెనకకు ఉంటాయి. ఇవి నీటిలో ఉన్నంతసేపు వాటి కాళ్లు కనపడవు. ఎంత దూరమైనా అవలీలగా నీటిలో వెళ్లిపోతాయి.

అది కూడా చాలా వేగంగా. అంతేకాదు.. నీళ్లలో పైకి లేచి కాళ్లతో పరుగెత్తుతాయి. అవి నేల మీద నడవడం చూస్తే నవ్వడం ఖాయం. అంత విచిత్రంగా ఉంటుంది వాటి నడక. దానికి కారణం వాటి కాళ్లు వెనుక భాగంలో ఉండడమే. వడివడిగా నడుస్తుంటే చూడ్డానికి భలే ఉంటుంది. వీటి కాళ్లే కాదు.. ముక్కు, మెడ, రంగు.. అన్నీ ప్రత్యేకమే. ముక్కు షార్ప్​గా ఉంటుంది. తలపైన నలుపు రంగులో వెంట్రుకలు ఉంటాయి. మెడ పొడవుగా ఉండి, పై భాగంలో ఆరెంజ్​ కలర్​లో మృదువైన ఈకలుంటాయి. 

ఈ పక్షులు పెట్టే గుడ్ల నుంచి పిల్లలు రావడానికి 29 రోజులు పడుతుంది. పిల్లల్ని వీపు మీద ఎక్కించుకుని ఈత నేర్పిస్తాయి ఈ పక్షుల తల్లిదండ్రులు. 

యునైటెడ్ కింగ్​డమ్​లో 19వ శతాబ్దంలో దీని మెడ మీద ఉండే మృదువైన ఈకల కోసం ఈ పక్షుల్ని వేటాడారు. ఆ ఈకల్ని మహిళలు తలకు పెట్టుకునే టోపీలు, వస్త్రాలను డెకరేట్ చేయడానికి వాడేవారు. ఆ తర్వాత రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్​ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఈ జాతిని రక్షించింది.