మాదాపూర్ గ్రామ శివారులో షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో గడ్డి, పైపులు దగ్ధం

గన్నేరువరం, వెలుగు: గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ శివారులో   ఆదివారం షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో నిప్పు రవ్వలు చెలరేగి పడి గడ్డి, పైపులు దగ్ధమయ్యాయి. బాధిత రైతు వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ట్రాన్స్‌‌ఫార్మర్‌‌‌‌ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడంతో నిప్పురవ్వలు చెలరేగి, చుట్టపక్కల పొలాలకు వ్యాపించింది. రైతు సంపతి ఉదయ్ కుమార్‌‌‌‌కు చెందిన పొలంలో ఉన్న గడ్డి కట్టలు, వ్యవసాయ పైపులు కాలిపోయాయి . 

సింగరావుపేటలో గడ్డి దగ్ధం

రాయికల్​, వెలుగు: రాయికల్ మండలం సింగరావుపేట గ్రామంలో  పశువుల పాక వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో బర్కం మధు అనే రైతుకు చెందిన 800 గడ్డి కట్టలు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు బీడి తాగి ఆర్పకుండా పడవేయడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని గ్రామస్తులు తెలిపారు.