పెండింగ్​ జీతాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా

కామారెడ్డి టౌన్, వెలుగు: పెండింగ్​లో ఉన్న జీతాలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు. సీఐటీయూ స్టేట్ వైస్​ప్రెసిడెంట్​ పాలడుగు సుధాకర్​మాట్లాడుతూ.. కార్మికులకు సకాలంలో జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

గుర్తింపు కార్డులతో పాటు, ఇన్సురెన్స్ ​సౌకర్యం కల్పించాలని, కారోబార్, బిల్​కలెక్టర్లను అసిస్టెంట్​ సెక్రెటరీలుగా నియమించాలన్నారు. అనంతరం ఆఫీసర్లకు వినతిపత్రం అందించారు. జిల్లా కన్వీనర్ ​చంద్రశేఖర్, ప్రతినిధులు వెంకట్​గౌడ్, బాలనర్సు, రాజయ్య, శ్యామ్, స్వామి, రవి, ప్రవీన్, రాజనర్సు పాల్గొన్నారు.