గ్రాడ్యుయేట్​ ఓటర్లు 4,61,806.. 12 జిల్లాలో ఓటర్లు తుది జాబితా

నల్గొండ, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్​ గ్రాడ్యుయేట్​ ఓటర్ల సంఖ్య తేలింది. మొత్తం 12 జిల్లాల్లోని ఓటర్ల తుది జాబితాను గురువారం నల్గొండ జిల్లా ఎన్నికల అధికారులు రిలీజ్​ చేశారు. గ్రాడ్యుయేట్​ ఓటర్లు మొత్తం 4,61,806 మంది ఉన్నట్టు ప్రకటించారు. వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

మొత్తం 600 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 80,559 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా సిద్ధిపేట జిల్లాలో 4,671 మంది ఉన్నారని ఆఫీసర్లు తెలిపారు.