పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాలం విద్యాసాగర్

ఆర్మూర్, వెలుగు : విద్యారంగ, నిరుద్యోగ యువత, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, తనను   గెలిపించాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ కోరారు. మంగళవారం ఆయన ఆర్మూర్​లో పర్యటించారు. పట్టభద్రులను కలిసి తనకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను డిగ్రీ కాలేజ్ లో 33 ఏళ్లు లెక్చరర్​గా, ఆ తర్వాత ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించానన్నారు.  

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశానని చెప్పారు. తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటానన్నారు. ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం శాసనమండలికి వస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల ఫీజు రియింబర్స్​మెంట్​విడుదల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు.

డిగ్రీ పట్టభద్రులు బుధవారం సాయంత్రంలోగా తమ ఓటు హక్కును తహసీల్దార్​ ​ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేదా ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  ఎమ్మెల్సీ ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 30 శాతం జరిగినందున మరింత గడువు పెంచాలని ఎన్నికల కమిషన్​ను కోరారు. సమావేశంలో సత్యనారాయణ, వినయ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.