టూల్స్ గాడ్జెట్స్ : మెరిసే క్యాప్‌‌‌‌

మెరిసే క్యాప్‌‌‌‌

కారు, బైక్‌‌‌‌ల టైర్లకు వాల్వ్ స్టెమ్ క్యాప్‌‌‌‌లు మామూలువి ఉంటాయి. వాటికి బదులు ఒకసారి వీటిని పెట్టి చూడండి. ఇవి కారు లుక్‌‌‌‌ పూర్తిగా మార్చేస్తాయి. ఈ స్టెమ్ క్యాప్స్​  ఒకరకమైన మెరిసే మెటీరియల్‌‌‌‌తో తయారు చేశారు. వీటిని బిట్‌‌‌‌నెక్స్‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇవి కారుకు యునిక్‌‌‌‌ లగ్జరీ లుక్‌‌‌‌ని తీసుకొస్తాయి. చీకట్లో ఇవి మెరుస్తుంటాయి. కారు రన్నింగ్​లో ఉన్నప్పుడు రిమ్‌‌‌‌ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. పైగా ఈ క్యాప్స్​ లోపల రబ్బరు సీల్స్‌‌‌‌ ఉండడం వల్ల గాలి లీక్‌‌‌‌ కాదు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎస్‌‌‌‌యూవీలు, మోటార్‌‌‌‌సైకిల్, బైక్, సైకిల్‌‌‌‌ అన్ని వాహనాల టైర్లకు వీటిని పెట్టుకోవచ్చు. 

ధర : 4 క్యాప్‌‌‌‌లు 199 రూపాయలు

జీపీఎస్ ట్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌లాంటి సిటీల్లో పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ అందరికీ సరిపడా ఉండదు. అందుకే సగం బైక్‌‌‌‌లు రోడ్డు మీదే ఇంటికి ఆనుకుని పార్కింగ్‌‌‌‌ చేస్తుంటారు. అలా రోడ్డు మీద పార్కింగ్ చేయడం వల్ల అవి చోరీకి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఇలాంటి జీపీఎస్ ట్రాకర్‌‌‌‌‌‌‌‌ని బైక్‌‌‌‌లో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేసుకుంటే బైక్‌‌‌‌కి సేఫ్టీ ఉంటుంది. దీన్ని ‘ఫెటాకా స్టోర్‌‌‌‌‌‌‌‌’ మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. లైవ్ జీపీఎస్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌తో ట్రావెల్ హిస్టరీ డాటాని కూడా ఇది స్టోర్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. రోజులో వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 
ఏ ప్లేస్‌‌‌‌కి వెళ్లింది?... ఇలాంటి డాటాని ఎప్పటికప్పుడు క్లౌడ్ సర్వర్లకు పంపుతుంది.

మొబైల్ యాప్‌‌‌‌లో లైవ్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ కూడా చూసుకోవచ్చు. అంతేకాదు.. బైక్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసిన ప్రతిసారి మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌కి నోటిఫికేషన్‌‌‌‌ వస్తుంది. ఇందులో వెహికల్ మూవ్‌‌‌‌మెంట్ అలారం కూడా ఉంది. అంటే.. వెహికల్‌‌‌‌ని దొంగతనంగా ఎవరైనా తీసుకెళ్తే.. యజమానికి అలర్ట్‌‌‌‌ పంపిస్తుంది. ఇందులో ఉన్న ఓవర్‌‌‌‌స్పీడ్ అలర్ట్‌‌‌‌ వల్ల యాప్‌‌‌‌లో ముందుగా సెట్‌‌‌‌ చేసి పెట్టుకున్న స్పీడ్‌‌‌‌కి మించితే.. వెంటనే నోటిఫికేషన్‌‌‌‌ వస్తుంది. దీన్ని బైక్‌‌‌‌లకే కాదు.. ట్రక్కు, బస్సు, కారు, స్కూటీ, అంబులెన్స్.. ఇలా వేటికైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేయడం కూడా చాలా ఈజీ. దీనికి పవర్‌‌‌‌‌‌‌‌ సప్లై ఇవ్వడంతో పాటు డాటా కోసం సిమ్‌‌‌‌ కార్డ్ ఇన్‌‌‌‌సర్ట్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. 

ధర : 1,600  రూపాయలు 

క్విక్‌‌‌‌ సెన్స్‌‌‌‌ 

చాలామంది పడుకునేటప్పుడు ఫోన్‌‌‌‌కి ఛార్జింగ్‌‌‌‌ పెట్టి మర్చిపోతారు. రాత్రంతా అలా ఆన్‌‌‌‌లోనే ఉంటుంది. కొందరేమో ఎలక్ట్రానిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కి ఉదయం ఛార్జింగ్‌‌‌‌ పెట్టే టైం లేక రాత్రిళ్లు పెడుతుంటారు. అయితే ఛార్జింగ్‌‌‌‌ పూర్తయ్యాక స్విచ్‌‌‌‌ ఆపడం మర్చిపోతారు. అలాంటివాళ్లు ఈ ఆటో కట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ని వాడాలి. ఇందులో సెట్‌‌‌‌ చేసిన టైంకి ఆటోమేటిక్‌‌‌‌గా పవర్ సప్లయ్​ ఆగిపోతుంది. ఈ డిజిటల్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ టైమర్‌‌‌‌‌‌‌‌ని క్విక్‌‌‌‌సెన్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఎప్పుడు ఆన్/ ఆఫ్ చేయాలి అనే  షెడ్యూల్‌‌‌‌ను సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే మామూలు పవర్‌‌‌‌‌‌‌‌సాకెట్‌‌‌‌కి దీన్ని ప్లగ్‌‌‌‌ చేయాలి. దీనికి ఛార్జింగ్ ఎడాప్టర్‌‌‌‌‌‌‌‌, లైటింగ్ పరికరాలు, ఫిష్ అక్వేరియం, గార్డెన్ లైట్లు, హోర్డింగ్ లైటింగ్, గ్లో సైన్ బోర్డ్, అవుట్‌‌‌‌డోర్ లైటింగ్, ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులు... ఇలా వేటినైనా ప్లగ్‌‌‌‌ చేసుకోవచ్చు. 

ధర : 740 రూపాయలు 

ఫోన్ హోల్డర్‌‌‌‌‌‌‌‌

ఇప్పుడు బైక్‌‌‌‌లతోపాటు కార్లకు కూడా అందరూ ఫోన్‌‌‌‌ హోల్డర్లు పెట్టించుకుంటున్నారు. కానీ.. కొన్ని లగ్జరీ కార్లలో ఫోన్ హోల్డర్ పెట్టడంతో డ్యాష్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ గందరగోళంగా ఉంటుంది. కానీ.. ‘బ్లాక్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ స్టోర్’ తీసుకొచ్చిన ఈ హోల్డర్ పెట్టుకుంటే..  చాలా స్టయిలిష్‌‌‌‌గా కనిపిస్తుంది. డ్యాష్‌‌‌‌బోర్డ్‌‌‌‌లో చిన్న లగ్జరీ పీస్‌‌‌‌లా ఉంటుంది. కాకపోతే.. దీన్ని వాడాలంటే.. ఫోన్‌‌‌‌కి మ్యాగ్నెటిక్‌‌‌‌ కేస్‌‌‌‌ వేసుకోవాలి.

ఫోన్‌‌‌‌ని ఈ హోల్డర్‌‌‌‌‌‌‌‌ దగ్గర పెట్టగానే అతుక్కుంటుంది. మొబైల్‌‌‌‌ని తీసేయడానికి, తిరిగి హోల్డర్‌‌‌‌లో పెట్టడానికి సింగిల్ టచ్ ఆపరేషన్ సరిపోతుంది. కారు150 కిలోమీటర్ల స్పీడ్‌‌‌‌తో వెళ్తున్నప్పుడు భారీ బంప్‌‌‌‌లు, కుదుపులు వచ్చినా హోల్డర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫోన్ కదలదు! ఇందులో బలమైన అయస్కాంతాలు ఉంటాయి. వాటివల్ల మొబైల్‌‌‌‌కి ఎలాంటి  హాని ఉండదు. అన్ని​ కార్లలో సులభంగా దీన్ని ఇన్‌‌‌‌స్టాల్ చేసుకోవచ్చు. కార్లలోనే కాదు.. బైక్, స్కూటర్, టేబుల్స్ ఎక్కడైనా ఇన్‌‌‌‌స్టాల్ చేయొచ్చు. 

ధర : 499 రూపాయలు