జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్ల టౌన్, వెలుగు: తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట జీపీ కార్మికులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేకపోతే నవంబర్ 20 తర్వాత నిరవధిక  సమ్మె చేపడతామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు మల్యాల నర్సయ్య, అన్నల్దాస్ గణేశ్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, మహేశ్‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.