క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి : ఆది శ్రీనివాస్

  • సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవంలో విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, వెలుగు : జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సీఎం కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్చ్​రిలే ర్యాలీని ఆయన మంగళవారం సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువత ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకాలు గెలిచేలా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలో అంతర్జాతీయ శిక్షణా సౌకర్యాలు కల్పించనుందన్నారు. 

దీనికోసం స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందన్నారు. వేములవాడలో స్టేడియం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక మండల కేంద్రాల్లో ఓపెన్ జిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్​కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ జిందం కళ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ పాల్గొన్నారు.