రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ పోరాటానికి మద్దతు ఇవ్వాలి  : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు:  బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలో ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత్ సెక్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశమని, ఇక్కడ హిందూ ముస్లింలు సోదరభావంతో ఉంటారన్నారు. అంతకుముందు మడేలేశ్వర ఆలయ సమీపంలో నిర్మించనున్న రజక సొసైటీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ వైస్​చైర్మన్​ బింగి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​ గౌడ్, కార్యదర్శి కనికరపు రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పుల్కం రాజు, అజయ్​, కొమురయ్య, అంజయ్య, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  పాల్గొన్నారు.