గోదావరి పరివాహక ప్రాంతాల్లో  అలర్ట్‌‌‌‌గా ఉండాలి : అడ్లూరి లక్ష్మణ్​

జగిత్యాల, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురిలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్ట్ గేట్టు ఎత్తే అవకాశం ఉండడంతో వరద ఉధృతి పెరుగుతుందని, తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.  

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పర్యటన 

జగిత్యాల రూరల్ వెలుగు: జగిత్యాల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతారం రోడ్‌‌డ్యాం వద్ద వరద ఉధృతిని పరిశీలించారు.  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా జగిత్యాల-–గొల్లపల్లి రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతారం రోడ్‌‌డ్యాంపై నుంచి వాగు పొంగుతుండడంతో పట్టణంలోని హరిహర నగర్, వెంకటాద్రి నగర్ కు రాకపోకలు నిలిచిపోయాయి.