విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

వేములవాడ, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో  విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో కామన్ మెనూ చార్జీలతో పాటు కాస్మోటిక్ చార్జీలు పెంచామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో స్టూడెంట్లకు కాస్మోటిక్స్ పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. త్వరలోనే 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు.

 కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహరం అందించాలని ఆదేశించారు.  కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, అక్రం పాషా తదితరులు పాల్గొన్నారు. 

కల్యాణ లక్ష్మీ చెక్కుల అందజేత 

చందుర్తి, వెలుగు:  ప్రజా ప్రభుత్వంలో  అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం 53 మంది లబ్ధిదారులకు 53.6 లక్షల విలువ చేసే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 16. 78 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.  

వేములవాడ నియోజకవర్గ పరిధలో ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు చేశామన్నారు.   ఎమ్మార్వో శ్రీనివాస్, ఇంచార్జ్ ఎంపీడీవో ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  రామస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, వైస్ చైర్మన్ మల్లేశం, డైరెక్టర్లు పాల్గొన్నారు.