వేములవాడలో  సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  

వేములవాడ/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కోరుట్ల/కోనరావుపేట, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి వేములవాడ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మల్కపేట రిజర్వాయర్, మర్రిపల్లి, లచ్చపేట ప్రాజెక్టు, కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువులను ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులు  90 శాతం పూర్తయ్యాయని మిగతా పనుల పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టగా.. అందులో ఎల్లంపల్లి, మల్కపేట రిజర్వాయర్ కూడా అందులో ఉన్నాయన్నారు. కలికోట సూరమ్మ చెరువు ద్వారా 43 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ అనిల్ కుమార్, సీఈ సుధాకర్ రెడ్డి,ఈఈ సంతు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వివిధ శాఖల ఆధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో పట్టణ కాంగ్రెస్  ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో  పాల్గొన్నారు.