కోరుట్ల, వెలుగు : తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కోరుట్లలోని ఓ ప్రైవేట్గార్డెన్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటిజన్స్ పిలుపు మాస పత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రెవెన్యూ డివిజన్‌లలో ఆర్డీవో ల ఆధ్వర్యంలో ట్రైబ్యునల్స్ ద్వారా నిరాదరణకు గురై తల్లిదండ్రుల కేసులను వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు చేస్తున్న సేవలను అభినందించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు పి.హనుమంత రెడ్డి, ఎం.డి. యాకుబ్, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, పుప్పాల ప్రభాకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎండి.మహమూద్ పాల్గొన్నారు.