యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో అర్హులకు లబ్ధిచేకూరిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మందుల సామేల్ తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం భువనగిరిలో జరిగిన వేడుకల్లో వారు మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్‌పై కళాకారులు నాటకంతోపాటు నృత్య ప్రదర్శన నిర్వహించారు.
మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి, గ్యాస్సబ్సిడీలో అర్హులైన వారందరూ లబ్ధిపొందారని నృత్య ప్రదర్శనలో వివరించారు. రుణమాఫీ కారణంగా రైతులకు కలిగిన ఉపయోగాన్ని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్వెంకటేశ్వర్లు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ పర్సన్ అలేఖ్య, కలెక్టర్హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్లు గంగాధర్, వీరారెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర, డీఆర్డీవో నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.