ప్రభుత్వ భూములు తీసుకుని.. ఇండస్ట్రీలు పెట్టలే లీజు బకాయి కడ్తలే.!

  • గత సర్కారు హయాంలో కేటాయించిన భూములు నిరుపయోగం
  • ఏండ్లవుతున్నా ఖాళీగానే.. బ్యాంకు లోన్లు తీసుకొని సైలెంట్​
  • టూరిజం కింద ఇచ్చిన భూములకు లీజు బకాయిలు చెల్లించని బడా కంపెనీలు 
  • దాదాపు రూ.400 కోట్ల పైనే ఉన్నట్లు లెక్కలు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆరా.. యాక్షన్​ తీసుకోవాలని ఆదేశాలు
  • లెక్కలు తీస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో వివిధ అవసరాల కోసం కేటాయించిన, లీజుకు ఇచ్చిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని టీజీఐఐసీ ఆధ్వర్యంలో తీసుకున్న భూముల్లో కొన్ని కంపెనీలు ఇంతవరకు ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదు. వ్యాపారం చేస్తామంటూ టూరిజం శాఖ నుంచి లీజుకు తీసుకున్న భూములకు కూడా ఏండ్ల తరబడి బడా సంస్థల నుంచి  బకాయిలు రావడం లేదు. దీంతో ఈ రెండు శాఖల్లో భూముల వ్యవహారంపై యాక్షన్​ తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది.

అటు భూ కేటాయింపులు, ఇటు లీజుల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గత పదేండ్లలో పరిశ్రమలకు చేసిన మొత్తం భూ కేటాయింపుల్లో 30 శాతం పైన ఖాళీగానే ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపుల్లోనూ ఇంకా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. వాటిపైన కూడా అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈ కంపెనీలకు ఒక నోటీసు ఇచ్చి చివరి అవకాశం ఇవ్వడమా లేక నేరుగా ప్రభుత్వమే వెనక్కి తీసుకొని కొత్త కంపెనీలకు కేటాయించడమా అనేదానిపై ఆలోచన చేస్తున్నది. ఇక టూరిజం కింద తీసుకున్న లీజు భూముల బకాయిల వ్యవహారం కోర్టులో ఉన్నది. కేసులు వెంటనే క్లియర్​ చేయాలని సీఎం ఆదేశించారు. 

బ్యాంకు లోన్లు తీసుకుని సైడ్​  

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పరిశ్రమల అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను టీజీఐఐసీకి ఇస్తారు. టీజీఐఐసీ ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కేటాయింపులు చేస్తుంది. అయితే, గత పదేండ్లు మాత్రమే కాకుండా అంతకు ముందు కేటాయించిన భూముల్లో ఇన్వెస్ట్​మెంట్స్​ పెట్టారా? లేదా? అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు.  గత పదేండ్లలో కేవలం ఇన్వెస్ట్​మెంట్లను ఎక్కువ చేసి చూపేందుకు ఇష్టారీతిన ఇండస్ట్రీలకు భూ కేటాయింపులు చేసినట్టు తెలుస్తున్నది. ఆ భూములను ష్యూరిటీలుగా చూపించి కొందరు బ్యాంకుల్లో  రుణాలు తీసుకొని సైడ్​అయిపోయారు. 

మరికొందరు టీజీఐఐసీ నుంచి తీసుకున్న భూములను సబ్​ లీజు పేరుతో ఇతర అవసరాలకు వేరే వాళ్లకు ఇచ్చినట్టు తెలిసింది.  గత ప్రభుత్వంలోని పెద్దలతో సాన్నిహిత్యం ఉన్న కొందరు పరిశ్రమల పేరుతో ముందస్తు ఒప్పందం ప్రకారం విలువైన భూముల్లో పాగా వేసి, ఆ స్థలాల్లో  ఇతర కార్యకలపాలు నిర్వహిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్నవాటితో పాటు ఒక ఇండస్ట్రీ అని చెప్పి ఇంకో వ్యవహారం చేస్తున్న భూములన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ భూములపై ప్రత్యేక నివేదికను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. 

Also Read :- సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ స్థలంలోప్రైవేట్ రోడ్డు

ఇప్పటికే కొన్ని భూముల కేటాయింపులను రద్దు చేసినా.. ఆ స్థలాల్లో సదరు కంపెనీలే ఉన్నాయి.  పారిశ్రామిక వాడల్లో విక్రయించగా మిగిలిన ప్లాట్లు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటి సంఖ్య, విస్తీర్ణం కూడా ఈ కమిటీ తేలుస్తుంది. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారా? లేదా? అనే అంశాలన్నింటిపై రిపోర్ట్​ ఇవ్వనున్నారు. టీజీఐఐసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 170కి పైగా పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. త్వరలో కొత్తగా మరో 35  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది. పరిశ్రమలకు భూముల కేటాయింపు కష్టంగా మారడంతో.. గతంలో కేటాయించగా నిరుపయోగంగా ఉన్నవాటిని వెనక్కి తీసుకోవాలని చూస్తున్నది. ఉచితంగా భూమి కేటాయించినా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని 225 సంస్థల నుంచి 1,964 ఎకరాల భూమిని టీజీఐఐసీ గతంలో వెనక్కి తీసుకుంది. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 

టూరిజం బకాయిలదీ అదే పరిస్థితి

సర్కారు జాగాల్లో వ్యాపారాలు చేస్తున్న బడా సంస్థల నుంచి టూరిజం డిపార్ట్ మెంట్ కు రావాల్సిన బకాయిలను వసూలు చేయడంపైనా  రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది.   దాదాపు రూ.400 కోట్ల బకాయిలుంటే.. అందులో 20 శాతం కూడా వసూలు కాలేదు. బాకీలు వసూలు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే, కొన్ని సంస్థలు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఇది పెండింగ్​లో పడింది. దీంతో కోర్టుల్లో కేసులు వెకెంట్ చేయించాలని  అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.  టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఒక్క హైదరాబాద్​లోనే వివిధ సంస్థల నుంచి రూ. 400 కోట్లు రావాల్సి ఉంది. సర్కారు స్థలాల్లో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీపీపీ) పద్ధతిలో అమ్యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు, హోటళ్లను పలు సంస్థలు ఏర్పాటు చేశాయి. 

ఉమ్మడి ఏపీలో లీజు ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన వాటిలో కొన్ని సంస్థలు ఇప్పుడు లీజు కిరాయిలు, ఇతర చార్జీలు చెల్లించడం లేదు. పీపీపీ కింద ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకున్న సంస్థలు అడిషనల్​ డెవలప్​మెంట్​ ప్రీమియం (ఏడీపీ), లీజ్​రెంటల్స్, ట్యాక్స్​లు చెల్లించాల్సి ఉంటుంది.  ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐమాక్స్,  జలవిహార్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రాక్‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నో వరల్డ్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పోటెల్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కావూరి హిల్స్‌‌‌‌‌‌‌‌లోని దస్పల్లా త్రీస్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌, శామీర్‌‌‌‌‌‌‌‌పేటలోని థీమ్‌‌‌‌‌‌‌‌పార్క్‌‌‌‌‌‌‌‌,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌కోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లోని అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని గోల్డెన్‌‌‌‌‌‌‌‌జూబ్లీ ఫైవ్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్స్‌‌‌‌‌‌‌‌, శేరిలింగంపల్లి గుట్టల బేగంపేట్‌‌‌‌‌‌‌‌లోని త్రీస్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ స్పా ప్రాజెక్టులు సర్కారు జాగాల్లో పీపీపీ మోడ్‌‌‌‌‌‌‌‌లో నిర్మించినవే. ఇవన్నీ ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఏండ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించడంలేదు.