1974లో టెన్త్‌‌ చదివిన పూర్వవిద్యార్థులు..50 ఏండ్లకు కలుసుకున్నరు

వేములవాడ, వెలుగు:  వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1974లో టెన్త్‌‌ చదివిన పూర్వవిద్యార్థులు 50 ఏండ్లకు కలుసుకున్నారు. భీమేశ్వర వీధిలోని బాలాంబిక సదనంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. 50 ఏండ్లకు కలుసుకోవడంతో వారంతా ఉల్లాసంగా గడిపారు. సుమారు 50 మంది పూర్వవిద్యార్థులు అపూర్వ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి హిందీ టీచర్‌‌‌‌ వాసాలమర్రి విట్టల్‌‌ మాట్లాడుతూ స్కూల్‌‌ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలన్నారు. నాటి గురువులు దేవేంద్రం, కామారపు సాంబశివరావులను పూర్వవిద్యార్థులు సన్మానించారు. 

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌‌లో 1991–-92 బ్యాచ్​కు చెందిన టెన్త్‌‌ విద్యార్థులు ఆదివారం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌లో కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌‌గెస్ట్‌‌లుగా నాటి హెచ్‌‌ఎం కుర్మాచలం వెంకటరంగయ్య, టీచర్లు విష్ణు ప్రకాశ్,  అశోక్ రెడ్డి, రంగాచార్యులు పాల్గొన్నారు. వారిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.