ఉమ్మడి జిల్లాలో రోడ్లకు రూ.120 కోట్లు

  • కరీంనగర్– హుస్నాబాద్ ఫోర్ లేన్​రోడ్డుకు రూ.77.20 కోట్లు
  • వానలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.43 కోట్లు
  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ల విస్తరణ, వర్షాలతో పాడైన రోడ్లకు రిపేర్లకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. రూ.120 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వరకు ఉన్న డబుల్ రోడ్డును ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు వారం కింద రూ.77.20 కోట్లు మంజూరు చేయగా.. తాజాగా ఉమ్మడి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి మరో రూ.43 కోట్లు శాంక్షన్ చేసింది. టెండర్ నోటికిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 

కొత్తపల్లి–హుస్నాబాద్ మధ్య ఫోర్ లేన్.. 

గతంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉన్న విషయం తెలిసిందే. జిల్లాల విభజనలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు సిద్ధిపేటలో కలిసినా ఆయా మండలాల ప్రజలు వివిధ అవసరాలకు ఇప్పటికీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుంటారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ శాఖ ఇంజినీర్లు రూ.150 కోట్లతో  ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి చిన్నముల్కనూరు, చిగురుమామిడి, సుందరగిరి, కొండాపూర్ మీదుగా హుస్నాబాద్ వరకు 24 కిలోమీటర్లు ఉంటుంది. 

ఈ రోడ్డును కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు  ప్యాకేజీలుగా చేసి రూ. 77 కోట్లతో ఒక భాగం, రూ.80 కోట్లతో మరో భాగం ఫోర్ లేన్ గా వంద ఫీట్ల రోడ్డును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోడ్డు నిర్మాణంలో కొత్తపల్లి, చిన్నముల్కనూరు, చిగురుమామిడి, సుందరగిరి, కొండాపూర్ తదితర గ్రామాల్లో ప్రజల ఇళ్లకు ఎక్కువ నష్టం జరగకుండా బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనల్లో ఉన్నట్లు తెలిసింది.

కేటాయింపులు ఇలా.. 

బోయినిపల్లి మండలం నల్గొండ టూ అనంతపల్లి రోడ్డుకు రూ.6 కోట్లు, కరీంనగర్ ఖాజీపూర్ ఎస్సీ కాలనీ వయా కాపువాడ, ఎరుకలవాడ రోడ్డుకు రూ.4.50కోట్లు, బొమ్మకల్ దుర్గమ్మ టెంపుల్ రోడ్డు రూ.4కోట్లు, రామడుగు మండలం శ్రీరాములపల్లి టు బూర్గుపల్లి వయా కారుపాకలపల్లి రోడ్డుకు రూ.2.50కోట్లు, గంగాధర మండలం గర్షకుర్తి వయా కాసారం రోడ్డుకు రూ.2.50 కోట్లు, చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం రాజారాం టు పోతారం రోడ్డుకు రూ.60 లక్షలు, ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం సీసీ రోడ్డుకు రూ.కోటి, గోపాల్ పూర్ అప్రోచ్ రోడ్డుకు రూ.కోటి 50 లక్షలు, బొమ్మకల్ టు మల్లిఖార్జున టెంపుల్ రూ.కోటి 50 లక్షలు, మొగ్దుంపూర్ ఎస్సీ కాలనీ రోడ్డుకు రూ.కోటి, నాగులమల్యాల టు నర్సింగాపూర్ రోడ్డుకు రూ.2కోట్లు, మల్కాపూర్ రోడ్డుకు రూ.60లక్షలు, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సీసీ రోడ్డు, డ్రైనేజీలకు రూ.3 కోట్లు, ఇదే మండలంలో సీసీ రోడ్డు, డ్రైనేజీలకు రూ.2కోట్లు, వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట టు ఆత్మకూరు రోడ్డుకు రూ.2కోట్లు, కథలాపూర్ మండలం చింతకుంట సీసీరోడ్డు పనులకు రూ.2 కోట్లు, వేములవాడ మండలం చెక్కపల్లి టు వట్టెముల రోడ్డుకు రూ.2.60కోట్లు, బోయినిపల్లి మండలం మల్కాపూర్ సీసీ రోడ్డుకు రూ.3కోట్లు, నర్సింగాపూర్ సీసీ రోడ్డుకు రూ.5 కోట్లు, హుజూరాబాద్ నియోజకవర్గంలో కాట్నపల్లి సీసీ రోడ్డు రూ. 8 కోట్లు, వీణవంక మండలం ఇప్పలపల్లి రోడ్డుకు రూ.60 లక్షలు, వేములవాడ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్ల రిపేర్లకు రూ.4 కోట్లు కేటాయించారు. 

వానలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు 

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల రిపేర్లకు రూ.2.91 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 304 అండర్ కన్స్ట్రక్షన్ రూరల్ రోడ్లు( సీఆర్ఆర్) పనులకు, 160 మండల రహదారుల మరమ్మతుల(ఎంఆర్ఆర్)కు గానూ 56.23 కిలోమీటర్లకు రూ.40.12 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో నిధులు మంజూరై పనుల్లో జాప్యం జరగడంతో ల్యాప్స్  కాగా.. వాటిని కూడా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.