- పాతవాటిని బలోపేతం చేస్తూ కొత్త సెంటర్ల ఏర్పాటు
- అగ్రికల్చర్ డిగ్రీ ఉన్న యువతకు ఉపాధి
- చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులోకి సేవలు
- బీఆర్ఎస్ పాలనలో నిస్తేజం
- కాంగ్రెస్ సర్కారు చెంతకు సేవా సెంటర్ల వివరాలు
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ఆగ్రోస్ రైతు సేవా సెంటర్లు యాక్టివ్ కానున్నాయి. గ్రామీణ నేపథ్యం గల వ్యవసాయ డిగ్రీ హోల్డర్లకు ఉపాధి చూపడంతో పాటు చిన్న సన్న కారు రైతులకు సేవలు అందించడంపై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పదేండ్ల పాటు చతికిల పడిన సెంటర్లకు మళ్లీ ప్రాణం పోయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అఫీషియల్‌గా 48 ఆగ్రోస్ కేంద్రాలు ఉండగా వాటి వివరాలను సర్కారు తెప్పించుకుంది.
ఇప్పుడున్న వాటికి అదనంగా కొత్తవి మరిన్ని ఏర్పాటు కాబోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ హయాంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో గవర్నమెంట్ 2007లో ఆగ్రోస్ రైతు సేవా సెంటర్లు ఏర్పాటు చేసింది. విలేజ్ల్లోని వ్యవసాయ డిగ్రీ లేక అనుబంధ డిగ్రీ చేసిన వారికి లైసెన్స్‌లు ఇచ్చి వీటిని అప్పగించింది. ఖరీఫ్, వానాకాలం పంటలకు కావాల్సిన మొత్తం యూరియాలో 60 శాతం మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా సింగిల్ విండోలకు చేరతాయి. 20 శాతం ప్రైవేట్ డీలర్లకు మిగితా 20 శాతం ఆగ్రోస్ రైతు సేవా సెంటర్ల ద్వారా రైతులకు విక్రయించేవారు.
యూరియా, పంట విత్తనాలు, క్రిమిసంహార మందులు ఈ సెంటర్ల ద్వారా అమ్మేవారు. రూ.3 లక్షల డబ్బు డిపాజిట్ చేయించుకొని ఆ మేరకు స్టాకు ఇచ్చేవారు అమ్మిన డబ్బులు కడితే మళ్లీ సరకు ఇచ్చేవారు. సింగిల్ విండోల అవినీతికి బ్రేక్ వేయడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించడం ఈ సెంటర్ల ఉద్దేశం. మార్క్‌ఫెడ్ సంస్థ సింగిల్ విండోలకు అందించే యూరియాను అధిక శాతం క్రెడిట్ పై అమ్మడం వల్ల అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఆపడానికి రైతు సేవా సెంటర్లను ఎక్కువ ప్రోత్సహించేవారు.
గవర్నమెంట్ తరహాలో ఆగ్రోస్ రైతు సేవా సెంటర్లు వడ్ల కొనుగోలు చేసి కమీషన్ రూపేణా ఆదాయం పొందుతాయి. ప్రతి సీజన్ లో రూ.8 లక్షలు కమీషన్ ఇన్కమ్ పొందే ఆగ్రోస్ సెంటర్లు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం వడ్ల కొనుగోలు వరకే వీటిని పరిమితం చేసి యూరియా, సీడ్, ఫెస్టిసైడ్ మందుల సప్లై బంద్ చేసింది. దీంతో ఆగ్రోస్‌కు రెగ్యూలర్ యాక్టివిటీస్ లేకుండా పోయింది.
డిగ్రీ హోల్డర్ల వివరాల సేకరణ ఆగ్రోస్ రైతు సేవా సెంటర్లను బలోపేతం చేయాలని నిర్ణయించిన స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడి జిల్లాలోని 48 కేంద్రాల వివరాలు రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖలతో తెప్పించుకుంది. విలేజ్ల వారీగా అగ్రికల్చర్ లేక అనుబంధ డిగ్రీ హోల్డర్ల సమాచారం సేకరించింది. ఇప్పుడున్న వాటికి రెండు, మూడు రెట్ల స్థాయిలో కొత్త సెంటర్లకు లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలో మాదిరి 20 శాతం యూరియా అమ్మకాలతో పాటు పంట విత్తనాలు, క్రిమికీటకాల పిచికారీ మందులు వీటితోనే సేల్ చేయించాలని డిసైడ్ అయింది.
అవును నిజమే
ఆగ్రోస్ రైతు సేవా సెంటర్లు బలోపేతం చేయాలని గవర్నమెంట్ నిర్ణయించిన మాట నిజమే. తమ నుంచి సర్కారు అడిగిన వివరాలు పంపినం. ఇప్పుడున్న సెంటర్లు యాక్టివిటీస్లేక చాలా వరకు సైలైంట్ అయ్యాయి. కొత్త మార్గదర్శకాలు వచ్చాక జోష్‌తో పనిచేసే వీలుంది. .
వాజీవ్హుస్సేన్, జిల్లా అగ్చికల్చర్ ఆఫీసర్