తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులకు అన్యాయమా.?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రస్థాయి ఉద్యోగులకే ఆప్షన్‌‌‌‌లు ఇచ్చి ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేశారు. మల్టీ జోనల్‌‌‌‌ / జోనల్‌‌‌‌ / ఉద్యోగులకు ఎటువంటి ఆప్షన్‌‌‌‌లు ఇవ్వక పోవటం వల్ల ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కల్గిన ఉద్యోగులు స్వంత రాష్ట్రానికి రావడానికి దాదాపు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ తర్వాత మ్యూచ్‌‌‌‌వల్‌‌‌‌ బదిలీల పేరుతో మల్టీజోన్‌‌‌‌లు / జోన్‌‌‌‌లు.. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య కొన్ని బదిలీలు జరిగాయి. అయితే ఆ సంతోషం ఎంతోకాలం ఉండలేదు.

ఆ మ్యూచ్‌‌‌‌వల్‌‌‌‌ బదిలీలలో ఒక కండిషను పెట్టారు. ఏంటంటే ఆంధ్రా నుంచి తెలంగాణకు బదిలీ అయి వచ్చిన వ్యక్తి తెలంగాణలో ఆ రోజుకు ఉన్న రెగ్యులర్‌‌‌‌ ఉద్యోగికంటే జూనియర్‌‌‌‌గా ఉండాలి. కానీ పరస్పర బదిలీల కోసం చర్య జరిపినప్పుడు మీ బ్యాచ్‌‌‌‌లో మిమ్మల్ని జూనియర్‌‌‌‌గా చేస్తాం. అని మాట ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారులు బదిలీల కోసం ఇచ్చిన మెమోలో మాత్రం అందరికంటే జూనియర్‌‌‌‌గా ఉండాలి అన్న నిబంధనలు పెట్టడంతో ఉద్యోగులు మానసిక క్షోభకు గురయ్యారు. 

జూనియర్ల కింద పనిచేసే దుస్థితి

అసలే ప్రమోషన్‌‌‌‌లు లేని పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మండల్‌‌‌‌ పరిషత్‌‌‌‌ అధికార్లు అందరికంటే జూనియర్‌‌‌‌లుగా అంటే 2018లో నియామకాలు అయిన వారికంటే బ్యాచ్‌‌‌‌లో జూనియర్‌‌‌‌గా ఉండాల్సి వచ్చింది. దీంతో వారితో 1999లో ఎన్నికయిన వారు జిల్లా పరిషత్‌‌‌‌ సీఈవోలు ఉంటే వారి కింద పనిచేయాల్సిన దుస్థితి.  ఇంకా 2018 కంటే ముందు జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా ఉద్యోగంలో చేరిన వారు ప్రమోషన్‌‌‌‌లు పొంది మండల్‌‌‌‌ పరిషత్‌‌‌‌ అధికారులుగా పనిచేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? స్వంత రాష్ట్రం వచ్చిన పాపానికి కొందరు ఉన్నతాధికార్లు చేసిన కుట్రపూరిత  ఉత్తర్వులకు వీళ్లు బాధలు పడాల్సిందేనా? 

తాబేదార్లకు ప్రమోషన్లు

 అసలు 25 ఏళ్ళ ఉద్యోగంలో ఒక్క ప్రమోషన్‌‌‌‌ ఇవ్వని గత ప్రభుత్వ రాజనీతికి పరాకాష్ట. గత ప్రభుత్వంలో పెద్దల్ని కలుసుకోలేక ఉన్నతాధికారుల చీత్కారాల మధ్య ప్రమోషను లేక దినదినం మానసిక క్షోభకు గురిచేయటం ఏ పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందో ఏలినవారికే తెలియాలి. అలాగని అందరికీ అలాంటి సమ అన్యాయం జరిగిందనటానికి చెప్పలేం. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే అధికార గణం దొంగచాటుగా గుట్టుచప్పుడు కాకుండా కమర్షియల్‌‌‌‌ టాక్సు డిపార్ట్‌‌‌‌మెంటులో, ఫారెస్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో, పంచాయతీరాజ్‌‌‌‌ శాఖలో కొంతమందికి సీనియారిటీ ఇచ్చి ప్రమోషన్‌‌‌‌లు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిది. 

గత ప్రభుత్వ నిర్వాకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ఉన్నప్పుడు జోనల్‌‌‌‌, మల్టీ జోనల్‌‌‌‌ వ్యవస్థలు ఆంధ్రా ప్రాంతం, తెలంగాణ ప్రాంత జిల్లాలుగా ఆయా జిల్లాల స్థానికత ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని పెట్టిన నిబంధన రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అదీ 2018లో పరస్పర బదిలీల అనుమతి ఇచ్చి వారికి సీనియారిటీ ఇవ్వకుండా వాళ్ల జూనియర్ల క్రింద పనిచేసే దౌర్భాగ్యం గత ప్రభుత్వపు పాలనది. ఆంధ్రాలో మిగిలిపోయిన తెలంగాణ స్థానికత కల్గిన ఉద్యోగుల ఫైలు కదలికకు ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌‌‌రెడ్డి నిర్ణయానికి వినమ్ర నమస్సుమాంజలులు.

సీనియారిటీని,అనుభవాన్ని కాలరాశారు

ఒక ఉద్యోగి నేరుగా నియామకం అయితే వారి సీనియారిటీని ఎన్నిక చేసిన పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వారి మెరిట్‌‌‌‌ ప్రకారం ఉండాలి. దానిని మార్చటానికి వీలు లేదు. కాని ఘనత వహించిన గత ప్రభుత్వం పరస్పర బదిలీలు అన్న ఒక్క నిబంధన పెట్టి 20, 25 ఏండ్ల  సీనియారిటీని, వారి అనుభవాన్ని కాలరాశారు. ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అదే ప్రభుత్వం పబ్లిక్‌‌‌‌ ఇంట్రస్ట్‌‌‌‌ మీద బదిలీ చేస్తే సీనియారిటీ భద్రత ఉంటుందట. నిబంధనలు ఏవైనా, ముఖ్యమంత్రికి  ఏదైనా మార్చే అధికారం ఉంటుంది. ఒక్క ప్రమోషన్‌‌‌‌ కూడా లేకుండా పదవీ విరమణ చేసే దుస్థితి ఈ తెలంగాణ స్థానికత కల్గి ఆంధ్రా నుండి బదిలీ అయిన ఉద్యోగు  లకు కలుగుతోంది.

ముఖ్యమంత్రికి విన్నపం

ఇదివరకే పరస్పర బదిలీలు అయి సీనియారిటీ కోల్పోయి నిరంతరం పనిచేసే చోట జూనియర్ల దగ్గర అవమానాలు, పెత్తనాలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు వారి బ్యాచ్‌‌‌‌లోనే జూనియర్‌‌‌‌గా ఉండేటట్లు చూసి వారికి అవకాశం వచ్చినప్పుడు ప్రమోషన్‌‌‌‌ కల్గించాలని  ముఖ్యమంత్రికి విన్నపం. అయినా పరస్పర బదిలీలలో ఒక ఉద్యోగి ఆంధ్రాకు పోతే ఇంకో ఉద్యోగి తెలంగాణకు వచ్చినట్టు కదా. అలాంటప్పుడు వారికి అదే బ్యాచ్‌‌‌‌లో జూనియర్‌‌‌‌గా ఉంచితే వచ్చే నష్టం కూడా 
ఏ ముండదు. ఇంకో విషయం 20 ఏళ్ళ పైబడిన ఉద్యోగులున్నచోట ఆర్థిక భారం లేదు. వారు ఇదివరకే ప్రమోషన్‌‌‌‌ పోస్టు స్కేలు కూడా చేరుకున్నారు. ఆంధ్రా క్యాడర్‌‌‌‌ అయినా డిప్యుటేషన్‌‌‌‌లో తెలంగాణలో పనిచేస్తూ ఉద్యమంలో కూడా పనిచేసినం. మమ్మల్ని గుర్తించండి.  రెగ్యులర్‌‌‌‌ ఉద్యోగి కూడా ఎవరి బ్యాచ్‌‌‌‌లో వారిని జూనియర్లుగా చేయండి. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రిని సవినయంగా వేడుకుంటున్నాం.

- డాక్టర్ నమోజు చారి , 
బీసీ ఉద్యోగుల సంఘం