భిక్కనూరు మండల అభివృద్ధి కృషి చేస్తా : షబ్బీర్ అలీ 

  •     ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

భిక్కనూరు, వెలుగు : భిక్కనూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గాల్​రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశానికి ప్రభుత్వ సలహాదారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌‌ లోకి వస్తున్నాయా లేదా అని అడిగారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సప్లై విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 మండల కేంద్రంలోని హరిజనవాడకు వెళ్లే దారిలో కరెంట్ స్తంభం తొలగించాలని కోరగా.. దానికి అయ్యే రూ. 13 వేలను ఆయన ఆఫీసర్లకు అందజేశారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ జరగకుండా చూడాలని ఎంఈవో ఎల్లయ్యను ఆదేశించారు.  అనంతరం పదవి ముగుస్తున్న ఎంపీటీసీలను సన్మానించారు. సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఆర్వో శివప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్లు గోండ్ల సిద్ధరాములు, కిష్టగౌడ్, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.