Aritificial Intelligence: 9 లోకల్ భాషల్లో Google AI జెమిని 

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్ GenAI జెమినిని గూగుల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీషు తోపాటు దేశంలో 9 భాషల్లో జెమిని యాప్ ను ఆవిష్కరించింది. 
హిందీ, బెంగాలీ,గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ తో సహా తొమ్మిది భాషలకు జెమిని మొబైల్ యాప్ మద్దతు నిస్తుంది. ఇది కస్టమర్ల కు AI సపోర్టు అందించడానికి దేశంలోని  అన్ని భాషలలో టైప్ చేయడానికి లేదా మాట్లడడానికి వీలుగా కల్పిస్తుంది. 

జెమిని మొబైల్ యాప్ కు జెమిని 1.0 ప్రో డీఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని గూగుల్ చెపుతోంది. అయితే జెమిని అడ్వాన్స్ డ్ యాక్సెస్ చేయడానికి సబ్ స్క్రైబ చేసుకోవాల్సిందే. 

క్లిష్టమైన డేటా ఎనాలిసిస్ నుంచి 1500 పేజీల పెద్ద డాక్యుమెంట్ల వరకు పెద్దఎత్తున డేటాను గ్రహించడం, జెమిని మొబైల యాప్ ద్వారా సపోర్టు చేసే 9 భారతీయ భాషలకు జెమిని అడ్వాన్స్ డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దేశంలో ఎక్కడైన వినియోగదారులుAI  సపోర్టును తీసుకోవడానికి ఈ భాషల్లో ఏదైనా టైప్ చేయడానికి , మాట్లా డ టానికి వీలు కల్పిస్తుంది. 

ఇండియాతోపాటు టర్కీ, బంగ్లాదేవ్, పాకిస్తాన్, శ్రీలంకలో లో జెమిని మొబైల్ యాప్ ను సైలెంట్ ప్రారంభించింది గూగుల్. ప్లేస్టోర్ ద్వారా  ఆండ్రాయిడ్ వినియోగ దా రులు జెమిని యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఐఫోన్ వినియోగదారులకు కొన్ని వారాల తర్వాత గూగుల్ జెమిని యాప్ అందుబాటులోకి రానుంది. 
గూగుల్ మెసేజస్ ద్వారా ఇంగ్లీషులో మంగళవారం (జూన్ 18) నుంచి ఇండియాలో వినియోగదారులకు జెమినీ అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది.