గూగుల్‌కు కష్టకాలం.. క్రోమ్ బ్యానేనా?

గూగుల్‪కు కష్టకాలం వచ్చింది. ప్రస్తుతం యుఎస్ రెగ్యులేటర్లు దాని క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాలని కోరింది. యుఎస్ ప్రాసిక్యూటర్లు బుధవారం టెక్ దిగ్గజం గూగుల్ డేటా, సెర్చ్ రిజల్ట్స్ ను ఇతర టెక్ కంపెనీలతో పంచుకోవాలని వాదించారు. ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి చర్యలను తీసుకోవాలని కోరారు. ఇలాంటి మార్పులు గూగుల్ ను 10 సంవత్సరాల పాటు కంట్రోల్ చేస్తాయి. ఆన్‌లైన్ సెర్చ్, సంబంధిత ప్రకటనలలో కంపెనీ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని కొనసాగించిందని అది వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు పర్యవేక్షణకు లోబడి ఉంటుంది. ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో 90 శాతం Google నియంత్రిస్తుంది. అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ జుడిష్యియల్(DOJ) గూగుల్ కు వ్యతిరేకంగా ఉంది. ఆన్ లైన్ మార్కెట్ లో గూగుల్ యొక్క గుత్తాదిపత్యాన్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంది.

ALSO READ | Adani Group Stock: అదానీ షేర్లు అన్నీ ఢమాల్.. 20 శాతం తగ్గిన ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

గూగుల్ చట్టవిరుద్ధమైన ప్రవర్తన ప్రత్యర్థులను ఎదగనివ్వకుండా చేస్తుందని,  కొత్త, వినూత్న మార్గాల్లో పోటీదారులు ఈ మార్కెట్‌లలోకి రావడానికి వీలు లేకుండా పోయిందని US న్యాయ శాఖ కోర్టు దాఖలు చేసింది.

గూగుల్ ని ఐదేళ్లపాటు బ్యాన్ చేయాలని, ఆన్ లైన్ మార్కెట్ లోకి రాకుండా నిరోధించాలని యూస్ న్యాయ శాఖ డిమాండ్ చేసింది. అది కుదరకపోతే.. గూగుల్ తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను విక్రయించాలని కోరుతున్నారు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్, ట్యాబెట్ వంటి డివైజ్ లో సెర్చ్ ఇంజన్ కోసం డీఫాల్ట్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ కావడం నేరమని.. ఇది ఇతర నెట్ వర్క్ కంపెనీలను ఎదగకుండా చేస్తోందని తెలిపారు. అయితే అమెరికా న్యాయశాఖముందు పెట్టిన డిమాండ్లు అమలు అయితే.. గూగుల్ కు ఒక సంవత్సరానికి 300 అమెరికన్ బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది.