Google Pixel:గూగుల్ పిక్సెల్ ఇండియా కొత్త బాస్ మితుల్ షా

గూగుల్..ఓ స్ట్రాటజిక్ మూవ్ మెంట్.. ఇండియా ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతోంది. ఇండియాలో డివైజెస్,సర్వీసెస్ బిజినెస్ కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించింది. గూగుల్ పిక్సెల్ మేనేజింగ్ డైరెక్టర్ గా యాపిల్ ఇండియా మాజీ ఎగ్జి్క్యూటివ్ మితుల్ షఆను అపాయింట్ చేసింది. 

గతంలో యాపిల్ ఇండియా సేల్స్ కన్స్యూమర్ సేల్స్ కు నాయకత్వం వహించారు.టెక్ ఇండస్ట్రీస్ లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది.  ఇప్పుడు భారత్ తో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణకు నాయకత్వం వహించనున్నాడు.

ALSO READ | Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్

ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన భారత్ లో  గూగుల్  లక్ష్యాలను సాధించేందుకు షాను ఆన్ బోర్డులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ లో గూగుల్ పిక్సెల్ వాటి కేవలం 0.04 శాతం మాత్రమే ఉంది. భారత్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ ను టెక్ దిగ్గజం  గూగుల్ పిక్సెల్ వినియోగించుకోవాలని ఆసక్తిగా ఉంది.