Google Gemini AI: లోకల్​లాంగ్వేజీల్లో గూగుల్ జెమిని AI.. తెలుగులోకూడా

Google ఇండియా తన సేవలను విస్తరిస్తోంది. ఇండియాలో గూగుల్​ చేపడుతున్న కొన్ని ముఖ్యమైన ప్రాడక్టులను అప్డేట్ చేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు భాషకు మాత్రమే సపోర్టు చేస్తున్న గూగుల్​ AI జెమిని.. ఇకపై లోకల్ భాషలకు కూడా మద్దతునిస్తుంది.  తెలుగు, తమిళం, బెంగాళీ, మరాఠి వంటి లోకల్​ భాషల్లో జెమిని AI  పనిచేస్తుంది. 

జెమిని AIవిస్తరణతో పాటు స్మాల్​ బిజినెస్​లను ప్రోత్సహిస్తోంది. ఇండియాలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలతో కలిసి పర్సనల్​లోన్లు, గోల్డ్​లోన్లను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఆర్థిక లావాదేవీల భద్రతకు సంబంధించిన మోసాలను అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది.  

గురువారం( అక్టోబర్5,2024) నాడు న్యూఢిల్లీలో జరిగిన 10 గూగుల్​ ఫర్​ ఇండియా ఈవెంట్ లో కీలకమైన అప్డేట్స్​ను ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉన్న జెమిని లైవ్​ ఇకపై లోకల్​ భాషల్లో అందుబాటులోకి రానుందని గూగుల్​ప్రకటించింది. ఈ క్రమంలో గూగుల్​ జెమిని లైవ్ను హిందీలో ప్రారంభించింది. త్వరలో 8 భారతీయ భాషలకు జెమిని లైవ్ సపోర్ట్​ చేస్తుందని తెలిపింది. 

గూగుల్ రిపోర్టుల ప్రకారం..40 శాతం కంటే ఎక్కువమంది భారతీయులు జెమినిని యాక్సెస్​ చేయడానికి వాయిస్ ని వినియోగిస్తున్నారు. అందుకు లోకల్​భాషలకు సపోర్టును విస్తరిస్తున్నట్లు తెలిపింది. తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ వంటి లోకల్​ భాషల్లో కూడి జెమిని విస్తరిస్తోంది.దీంతో పాటు గూగుల్​ మ్యాప్స్​ వినియోగదారులకోసం భారత్లోని రెండు కొత్త రియల్​ టైమ్​వెదర్ కూడాఉన్నాయి.

Also Read :- తిరుమల టూర్​.. ఈ తీర్థ క్షేత్రాలను తప్పక చూడండి

గూగుల్​ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ల ఫ్రాడ్​లెంట్ మ్యాప్​లను తీసివేస్తామని Google హామీ ఇచ్చింది. Google Play భారతీయ డెవలపర్‌ల కోసం ప్రతియేటా రూ. 4వేల కోట్లకు పైగా ఆదాయాన్ని అందిస్తోంది. గూగుల్​ సెర్చ్​ లో AI డిజిటలైజ్​ మెనూ ఆప్షన్​ ద్వారా కొత్తగా SMBలు, బిజినెస్​ లను ప్రారంభిస్తోంది. గూగుల్​ రిపోర్టుల ప్రకారం..టైర్​2 పట్టణాల్లో దాదాపు 80శాతం లోన్లను అందించింది. దాదాపు 5కోట్ల మంది ఇండియన్ యూజర్లు గూగుల్​పే ద్వారా సిబిల్​ స్కోర్​ ను ఉపయోగిస్తున్నారు. 

గూగుల్​ ద్వారా పర్సనల్, గోల్డ్ లోన్లు..

గూగుల్​ పే ద్వార పర్సనల్​ లోన్లను అందిస్తోంది గూగుల్. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో పర్సనల్​లోన్లను ఇస్తోంది. దీంతో  గోల్డ్ లోన్లను కూడా ప్రొవైడ్ చేస్తోంది. ప్రముఖ గోల్డ్ ఫైనాన్ష్​ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్​తో కలిసి బంగారంపై రుణాలను మంజూరుచేస్తోంది. 

మోసాలను అరికట్టడంలో గూగుల్ ఇండియా.. 

ఆర్థికపరమైన లావాదేవీలలో మోసాలను అడ్డుకునేందుకు గూగుల్​గట్టి చర్యలు తీసుకుంటోంది. గతేడాది రూ. 13వేల కోట్ల ఫైనాన్సియల్ స్కామ్​ లను అడ్డుకున్నట్లు గూగుల్​రిపోర్టులు చెబుతున్నాయి. 41 మిలియన్ల ఫ్రాడ్​ లెంట్​లావాదేవీలను నిలిపివేసింది. దీంతో పాటు ఇండియాలో సేఫ్టీ ఇంజనీరింగ్​ సెంటర్​ను ఏర్పాటు చేయనుంది.