వారానికి ఒక రోజు ఆఫీసుకు వస్తే.. ఇలాగే వెనకబడతాం : గూగుల్ మాజీ సీఈవో

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AIలో గూగుల్ బాగా వెనకబడి ఉంది.. మిగతా టెక్ కంపెనీల ఏఐలతో పోల్చితే గూగుల్ మెరుగ్గా పని చేయటం లేదన్నారు ఆ కంపెనీ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్. 2001 నుంచి 2011 గూగుల్ సీఈవోగా పని చేసిన ఎరిక్ స్మిత్.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ ఉద్యోగుల పని విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గూగుల్ లో ఐదు రోజుల పని విధానం.. అందులోనూ ఒక రోజు ఆఫీసుకు వస్తారు.. మిగతా నాలుగు రోజులు ఇంటి నుంచే పని చేస్తారు.. దీని వల్ల కంపెనీ సామర్థ్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. మిగతా టెక్ కంపెనీల్లో ఉద్యోగులు నరకంగా పని చేస్తారని.. ఎక్కువ పని గంటలు పని చేస్తూ.. కొత్త కొత్త ఆవిష్కరణలతో గూగుల్ కు పోటీ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గూగుల్ చాలా వెనకబడిందని.. మిగతా టెక్ కంపెనీలు గూగుల్ కంటే మరింత మెరుగ్గా పని చేస్తున్నాయన్నారు. ఏఐ రేసులో గూగుల్ వెనకబడటంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అసవరం ఉందన్నారు స్మిత్. గూగుల్ పని సంస్కృతి మారాల్సిన అవసరాన్ని గుర్తు చేశారాయన. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉంటున్నాను.. అలా అని ఇంట్లో నుంచి పని చేసే సంస్కృతికి వ్యతిరేకం అని వివరించారాయన. ఇంట్లో నుంచి పని చేయటం వల్ల వినూత్నమైన ఆలోచనలను కోల్పోతామని.. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చెప్పిన విషయాన్ని ఆ కోట్ చేశారు. తైవాన్ దేశంలోని ఎలన్ మస్క్ సెమీకండెక్టర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు స్మిత్..

ఆ సెమీ కండెక్టర్ ఫ్యాక్టరీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రతి విభాగానికి ఎంతో ప్రత్యేకత ఉందని.. ఆర్ అండ్ డీ వరకు అన్ని విభాగాలను ఒకేసారి.. ఒకే చోట నిర్మించటం.. ఆఫీసు నుంచే పని చేయటం ద్వారా ఎంతో మెరుగైన ఫలితాలను సాధించిన విషయాన్ని గుర్తించారాయన. ఇలాంటి ఆవిష్కరణలు, కొత్త పని విధానంలోకి గూగుల్ మారకపోతే ప్రమాదం అంటూ హెచ్చరించారు మాజీ సీఈవో ఎరిక్ స్మిత్.