మీకు తెలుసా? : 90ఏళ్ల నాటి రైల్వే స్టేషన్‌ను గూగుల్ ఆఫీస్‌గా మార్చేసింది

టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ మార్కెట్ లో గట్టిపోటీ ఇస్తుంది. దాని కార్యకలాపాలకు అనుగుణంగా ఆఫీసులు కూడా విస్తరిస్తుంది. ఆ కంపెనీ న్యూయార్క్ ఆఫీస్ నిర్మాణం కోసం 2018లో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పుడు న్యూయార్క్ లో గూగుల్ ఉద్యోగుల సంఖ్య 7వేలు. వర్క్ ప్లేస్ సరిగ్గా సరిపోయేది కాదు.. సౌకర్యవంతంగా కూడా లేదు.

దీంతో న్యూయార్క్ నగరంలోని హడ్సన్ స్క్వేర్ సమీపంలోని 1934లో ఏర్పాటు చేసిన సెయింట్ జాన్స్ రైల్వే స్టేషన్ రీజుకు తీసుకోవాలని నిర్ణయించుకుంది గూగుల్ సంస్థ. పాత రైల్వే స్టేషన్ ను గూగుల్ ఆఫీస్ గా ఎలా మార్చుతుందని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఓ కొత్త థీమ్ తో రైల్వే టర్మినస్ ను గూగుల్ ఆఫీస్ గా మార్చేసింది. అంతే కాదు ఇప్పుడు అదే గూగుల్ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తోంది.

 12 అంతస్థుల ఆ బిల్డంగ్ ఆహ్లాదకరమైన వాతవరణంతో డిజైన్ చేయబడింది. గూగుల్, దాని కో ఆర్టినేట్ టీంల కోసం న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ పక్షులు, చెట్లతో అలంకరించింది. ఎకరన్నర ప్రాంతంలో రైల్ బెడ్ గార్డెన్, టెర్నస్ లు, 95 శాతం న్యూయార్క్ చెందిన మొక్కలతో రూపొందించారు. దీంతో అక్కడికి పక్షుల వలస రావడం ప్రారంభించాయి.

40కంటే ఎక్కువ జాతుల పక్షులు అక్కడ ఉన్నాయి. ఆఫీస్ లో ఎంప్లాయిస్ పీస్ ఆఫ్ మైండ్‌తో వర్క్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్విరాన్ మెంట్ చాలా గ్రీనరీ, నాచ్యురల్ గా ఉంటుంది. 2018లో ఆ ప్లేస్ ను గూగుల్ 2.4 బిలియన్ డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది. దీని ఇంటీరియర్‌లను అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ స్టూడియో జెన్స్‌లర్ రూపొందించారు.