Good Health : మంచి నిద్రకు మిలటరీ టెక్నిక్.. ఫేస్ రిలాక్స్ అంటే ఏంటీ.. ఈ టెక్నిక్ ఎలా ఫాలోకావాలంటే..?

'గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్' నిజంగా ఇదొక మంత్రమైతే బాగుండు. ఇట్ల అనుకోగానే అట్ల నిద్ర పడితే ఆహా... ఆ హాయే వేరు కదా! ఎందుకంటే పదిమందికి గుడ్ నైట్ చెప్పినా, మెసేజ్​లు  పెట్టినా నిద్రపట్టదు. రాత్రి మంచమెక్కంగనే.. కన్నంటుకునే అదృష్టం అందరికీ ఉండదు. మరి ఎలా? నిద్రొచ్చేదాకా జాగారం తప్పదా? అంటే.. ఈ టెక్నిక్ ఫాలో అయితే.. మీ పేరు కూడా అదృష్టవంతుల లిస్ట్​ లో చేరిపోతది. అమెరికా ఆర్మీ ఫాలో అయ్యే స్లీప్ టెక్నిక్స్​ పై  ఓ లుక్కెయ్యండి.. వెంటనే నిద్రలకు జారుకుంటరు!

సైనికుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడంటే చాలు.. క్షణం క్షణం పోరాటమే చేస్తాడు. ఎంత సైనికుడైనా.. మనిషే కదా! అతనికి కూడా నిద్ర వస్తుంది. నిద్ర లేకుంటే బాడీ యుద్ధానికే కాదు... దేనికీ సహకరించదు. అందుకే ఉన్న టైమ్​ నే  ఉపయోగించుకోవాలి. ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు. రెస్ట్ కావాలి. కాబట్టి, కన్ను మూసిన వెంటనే నిద్రపట్టాలి. కూత పెట్టగానే మేల్కోవాలి. అది మాటలతో చెప్పినంత ఈజీకాదు. 

అందుకే.. పరిస్థితులు ఎలా ఉన్నా.. సైనికులు రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకునే ఒక టెక్నిక్​ ను  అమెరికా ఆర్మీ ఫాలో అవుతోంది. అది మామూలుగా నిద్ర పోవడానికి ఇబ్బంది పడేవాళ్లకు కూడా ఉపయోగపడుతుందనడంలో డౌట్ లేదు.
రిలాక్స్ అండ్ విన్
టెన్షన్ని తట్టుకొని అథ్లెట్​ గా  విజయం ఎలా సాధించాలనే విషయంపై 1981లో లెజెండరీ స్ప్రింటింగ్ కోచ్ లోయిడ్ బడ్ వింటర్ రాసిన 'రిలాక్స్ అండ్ విన్ చాంపియన్ షిప్ పెర్ ఫార్మెన్స్ ఇన్ వాటెవర్ యూ డూ' అనే పుస్తకం నుంచి ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారు. 'ప్రెజర్, టెన్షన్ ను తట్టుకొని ఎవరికి వాళ్లు తమంతట తామే రిలాక్స్ అయి.. ఎలా విజయం సాధించాలి? ఒత్తిడి పరిస్థితుల్ని.. ఎలా 'పీక్ పర్ఫార్మెన్స్' మూమెంట్స్ ఎలా మార్చుకోవాలి?' అనే విషయాల్ని ప్రస్తావిస్తూ రాసిన ఆ బుక్ ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్​కు  గైడ్ గా  మారింది. ఆ బుక్ చదివి రికార్డులు బ్రేక్ చేసిన వాళు ఎంతోమంది ఉన్నారు. దీన్నే అమెరికా ఆర్మీ ఉపయోగించుకుంది. ఆర్మీలో చేరిన వాళ్లకు ఆరు వారాలు ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయిస్తారు. తర్వాత సైనికులు తాము నిద్ర పోవాలి.   అనుకున్న రెండు మూడు నిమిషాల్లో నిద్ర పోతారు. ఇది మొత్తం ఆర్మీలో 96 శాతం మందిలో సక్సెస్ అయింది. ఈ టెక్నిక్ కి నాలుగు స్టెప్స్ ఉంటాయి.

చాలా ఈజీ

ఇవి చేయడం చాలా ఈజీ! ఈ మిలటరీ ట్రిక్​ తో  కేవలం నాలుగు శాతం మందికి మాత్రమే పని చేయలేదు. మంచి నిద్ర ఉన్నప్పుడే.. మీరు ఏ పనైనా చేయగలుగుతారు. మీ శరీరం చెప్పేది వినడాన్ని మించిన మ్యాజికల్ ఫార్ములా ఈ లోకంలో ఇంకేదీ లేదు అని ఈ టెక్నిక్ గురించి యూఎస్ ఆర్మీ వెబ్​సైట్ చివరి వాక్యం రాసింది. నిజమే కదా! మన శరీరం చెప్పేది వింటే సరిపోతుంది

ఇలా చేయాలి

  •  ముందు ఫేస్ మజిల్స్ రిలాక్స్ చేసుకోవాలి. దీంట్లో కళ్ల చుట్టు ఉండే మజిల్స్, నాలుక, దవడ మజిల్స్ కూడా ఉంటాయి. పళ్లు ఉన్నాయనే సంగతి కూడా మర్చిపోవాలి.
  •  ఒకసారి ఫేస్ రిలాక్స్ అయితే... భుజాలను కిందికి దించాలి. అవి ఎంత కిందికి వెళితే.. అంత కిందికి. తర్వాత చేతుల్ని ఒక్కోవైపు ఒక్కోసారి కిందికి దించాలి.
  • ఛాతి నుంచి గట్టిగా శ్వాస బయటికి వదలాలి. తర్వాత కాళ్లను కిందికి అని..స్ట్రెయిట్​ గా  చాపుకోవాలి. తర్వాత మనసులో తొడల నుంచి కింది వరకు కాళ్లు రిలాక్స్ అవ్వాలి.. 
  • తర్వాత మైండ్​ ను  క్లియర్ చేసి.. తమకు తాము ఈ మూడింటిలో ఏదో ఒకటి ఊహించుకోవాలి.
  •  ఒక నది లేదా సరస్సులో తేలుతున్న పడవపై పడుకున్నట్టు ఊహించుకోవాలి. పైన ఏమీ లేదు... నిర్మలమైన ఆకాశం తప్ప అనుకోవాలి.
  • చిమ్మ చీకటి గదిలో.. మెత్తని మంచపై పడుకున్నట్టు ఊహించుకోవాలి.
  • మళ్లీ మళ్లీ ఇంకేం ఆలోచించకు' అని ఎవరికి వాళ్లే అనుకోవాలి.
  • ఇలా చేసిన పది సెకండ్ల తర్వాత కచ్చితంగా నిద్రలో మునిగి.. కలల
  • ప్రపంచంలో తేలడం ఖాయం. ఇదే అసలు సిసలు". గుడ్​నైట్.. స్వీట్ డ్రీమ్స్!

–వెలుగు, లైఫ్​–