Good Relax : మ్యాజిక్ చేసే మ్యూజిక్ ఇలా ఉంటుంది..!

శరీరానికి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకెళ్లి మందులు తెచ్చుకుంటాం. మరి మనసుకు జబ్బు చేస్తే... సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేకుండా మ్యూజిక్ వింటే చాలు అంటున్నారు. మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి ఒక్కరి జీవితంలో మనసు అలజడికి గురవుతుంటుంది. అలాంటప్పుడు మ్యూజిక్ థెరపీ చాలా మంచిది. దీనివల్ల మనసులోని ఉద్వేగాలు కుదుటపడతాయి.

ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. శరీరంలో రసాయనికక్రియ సరిగా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీలో సాహిత్యంతో కూడిన సంగీతం వినిపిస్తారు. ఎందుకంటే, సాహిత్యంలో మనసుకు ఆనందాన్నిచ్చే భావాలు ఉంటాయి. ఒత్తిడిలో ఉన్న వాళ్లు వాటి గురించి ఆలోచిస్తారు. 

మానసికంగా కుంగిపోయిన వాళ్లకు ఆ భావాలు దిశానిర్దేశం చేస్తాయి. ఈ థెరపీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక, భుజాలు, మెడ కండరాల నొప్పులు వస్తాయి. అయితే మ్యూజిక్ థెరపీ వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. మ్యూజిక్ థెరపీ నిద్రలేమి సమస్యను తగ్గించి హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.

Also Read: పని ఒత్తిడి నుంచి ఇలా రిలాక్స్ అవ్వండి.. ఉత్సాహం ఉరకలేస్తుంది..!

పాటలు వినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్రలేచిన తర్వాత మ్యూజిక్ వినడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది. బీపీలాంటివి రావు..