హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే 65 సంవత్సరాలకు మాత్రమే ఎలిజిబుల్..ఆపైబడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు.కానీ ఇప్పుడు ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇక నుంచి వయస్సుతో సంబంధం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్కు రెడీ అవుతుంది. ఈ మేరకు విధివిధానాలు రెడీ అయిన బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది.ప్రస్తుతం ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ..65 ఏళ్ల వరకు మాత్రమే పాలసీలు ఇస్తుంది.
ప్రీమియం ఆధారంగా ఆయా వ్యాధులకు చికిత్స ఇస్తుంది.వయస్సు పెరిగేకొద్దీ, మనకు ఉన్న అనారోగ్యాల ఆధారంగా ప్రీమియం చెల్లింపు ఉంటుంది.ఇక నుంచి వయస్సుతో సంబంధం లేకుం డా.. జీవిత కాలం హెల్త్ ఇన్సూరెన్స్ అమలు అయ్యే విధంగా కొత్త పాలసీలు తీసుకురాబోతున్నాయి కంపెనీలు..ఏ వయస్సుకు ఎంత ప్రీమియం ఉంటుంది..ఎలాంటి వ్యాధులకు జీవిత కాలం చికిత్స భరోసా ఇస్తారు అనేది త్వరలోనే ప్రకటన రానుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆరోగ్య బీమా పాలసీదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడానకి గరిష్ట ప్రవేశ వయస్సును తొలగించేందుకు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం బీమా పాలసీకి వ్యక్తులు 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితి నిబంధన ఉంది.
IRDAi కొత్త ప్రతిపాదనతో ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా కవరేజీని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ విభాగంలోని విభిన్న అవసరాలను గుర్తించి సీనియర్ సిటిజన్లను, మిలీనియల్స్ వరంటి నిర్ధిష్ట జనాభాను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన పాలసీలను ప్రవేశపెట్టాలని రెగ్యులేటర్ బీమా సంస్థలను కోరింది.