గుడ్ న్యూస్.. ఇండియన్ టూరిస్టుల కోసం..యూఏఈ కొత్త వీసా పాలసీ

  • ఇండియన్స్కు యూఏఈ గుడ్ న్యూస్..
  • మనోళ్ల కోసం వీసా ఆన్ అరైవల్ పాలసీ 

అబుదాబి: ఇండియన్స్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గుడ్ న్యూస్ చెప్పింది. మన దేశ టూరిస్టుల కోసం కొత్తగా వీసా ఆన్ అరైవల్ పాలసీని తీసుకొచ్చింది. ఇకపై వీసా లేకున్నా సరే విమానం ఎక్కేయొచ్చు, అక్కడి ఎయిర్ పోర్టులో దిగగానే వీసా తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని రూల్స్ పెట్టింది.

 చెల్లుబాటయ్యే అమెరికా వీసా, రెసిడెంట్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డు ఉన్న ఇండియన్ పాస్​పోర్ట్  హోల్డర్లు లేదా బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లోని ఏదైనా దేశం జారీ చేసిన వీసా లేదా రెసిడెంట్ పర్మిట్ ఉన్నోళ్లు మాత్రమే అర్హులు. అలాగే కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్ పోర్టు కూడా ఉండాలి. 

వీసా ఆన్ అరైవల్ కింద 14 రోజుల వీసా ఇస్తారు. దాన్ని మరో 14 రోజులు పొడిగించుకోవచ్చు. లేదా పొడిగించేందుకు వీలులేని 60 రోజుల వీసా తీసుకోవచ్చు.