Good Health : మాచా టీతో.. టెన్షన్ ఫ్రీ ఇలా..

 రోజూ టీ తాగనిదే గడవదు. చాలామందికి, టీ లో కూడా గ్రీన్ టీ, జింజర్ టీ, లెమన్ టీ అని బోలెడు రకాలు. అయితే వీటన్నింటి కన్నా.. మాచా టీ చాలా బెస్ట్ అంటున్నారు. సైంటిస్టులు, మాచా టీ జపనీస్ ఎక్కువగా తాగుతారు. ఇది చూడడానికి గ్రీన్ టీ లాగానే ఉంటుంది. జపనీస్ ఫేవరెట్ మాచా టీ... ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యల నుంచి బయట పడేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. 

జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం... మాచా పౌడర్, మాచా ఎక్స్ట్రాక్ట్లను వాడి ఎలుకలపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయిందట. ఆందోళనగా, కంగారుగా కనిపించిన ఎలుకలు మాచా టీ పౌడర్ తినగానే ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాయని సైంటిస్టులు గుర్తించారు. సైంటిస్టులు చెప్తున్నదాని ప్రకారం.. మాచా టీని తాగడం వల్ల ఆ పొడిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో దోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట.

 దీంతో మనస్సు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇతర అన్ని మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మాచా టీ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది. కావాలంటే ట్రై చేయొచ్చు.