• ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కళ్లపై ఒత్తిడి పడుతుంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు కళ్లను మరింత ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ గాడ్జెట్ ల ద్వారా వచ్చే వెలుతురు కళ్లకు హాని చేస్తుంది. అందుకని వీలైనంతగా ఆ లైటింగ్ కు దూరంగా ఉండాలి.
• కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ లైట్ చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఇది ఇంపార్టెంట్. పిల్లలను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచడం వల్ల షార్ట్ సైట్ వచ్చే అవకాశం ఉంది.
• విటమిన్-ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, క్యారెట్లు తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. డిజిటల్ పరికరాల నుంచి వచ్చే లైట్ వల్ల కంటి కండరాలు దెబ్బతింటాయి. కాబట్టి వాటిని వీలైనంత తక్కువ వాడాలి.
• సిగరెట్లు తాగడం వల్ల కంటి సమస్యలు రెట్టింపు అవుతాయి.
• 25--30 ఏళ్ల వాళ్లు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి.