Good Health : ఈ 9 రకాల ఫ్రూట్స్, కూరగాయలు తింటే.. ఆరోగ్యంతో పాటు అందం కూడా..!

ఆరోగ్యమైన, అందమైన చర్మాన్నిఅందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. రక రకాల క్రీములు రాస్తూ, ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ మెరువులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం. మీ సొంతమవుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు మొటిమలు పోయి ఆరోగ్యంగా కనిపించాలంటే ఏం తినాలంటే..

పాలకూర

విటమిన్-ఎ, బీటా కెరటిన్ లు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనం గా నిగనిగలాడేలా చేస్తాయి. పాలకూరను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే శరీరంలోని వ్య రాలను బయటకు పంపడంలో పాలకూర బాగా పనిచేస్తుంది.

క్యారెట్స్

విటమిన్ -ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం. వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇందులో ఉండే బీటా కెరటిన్ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ బి6

విటమిన్-బి6 ఎక్కువగా ఉండే క్యారెట్, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్స్, అవకాడో హార్మోన్లలోని తేడాల వల్ల వచ్చే మొటిమలను నివారిస్తాయి. అలాగే హార్మో న సమతుల్యత సరిగా జరిగేలా చూసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బొప్పాయి.

బొప్పాయిలో విటమిన్-సి, ఇ, బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసు కోవడం వల్ల చర్మంపైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ దూరమై అందంగా మారతారు.

ఒమేగా3 ఫ్యాటీ

చేపలు, సోయా ఉత్పత్తు లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు, డిపై షన్ లాంటివి దూరమవుతాయి. చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది. తాజా చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరిపిస్తుంది.

యాపిల్ ఆక్సిడెంట్స్

యాపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. అందుకే చర్మం యవ్వనంగాఉండాలంటే ఈ పండ్లు తినాలి. అలాగే పల్లీలు, బీట్ రూట్, కివీ పండ్లను తరచూ తింటే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.

బాదంప పప్పు

విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పప్పుల్లో  పుష్కలంగా ఉంటాయి. రోజూ 4 బాదం పప్పు బ్నిరాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. అలాగే కీరదోసకాయను తొక్కతో. తినడం మంచిది. అందులోని విటమిన్-ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు కీరదోస కాయ ముక్కల గుజ్జును ముఖానికి పట్టి స్తే నల్లటి మచ్చలు దూరమవుతాయి.

టొమాటోలు:

టొమాటోలో విటమిన్-ఎ, కె.బి1, బి3, బి5,బి6, బి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ అక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా టొమాటోల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలుష్యం, సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

డార్క్ చాక్లెట్స్

యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్ చా క్లెట్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అలాగే ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్లో పేరు పదార్థాలు ఎక్కువ. ఇవి చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

ఇవి వద్దు

కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మంలో నీ తేమను పీల్చుకుని చర్మం పొడిబారేలా చేస్తాయి. అలాగే కెఫిన్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి వ్యర్థాలు పేరు కుపోయే అవకాశాలు ఎక్కువ. పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలైన కెట్లు, సోడా డ్రింక్స్. భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా ఉండే పా నీయాలను తీసుకోవడం చర్మానికి మంచిది కాదు. వీటివల్ల మొటిమలు వస్తాయి. బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే ఫుడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువ. అందువ ల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడతలు పడేందుకు దోహదం చేస్తాయి. నూనె పదార్ధాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాల్లో ట్రాన్స్- ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

ALSO READ | Good Health : గ్రీన్ టీలో.. కలబంద కలిపి తాగితే.. ఇట్టే బరువు తగ్గుతారు..!