Good Food : ఆకు కూరల ఔషధం.. ఏ ఆకును ఎలా తింటే మంచి ఆరోగ్యమో చూద్దాం..!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఉండే పోషకాలు జ్ఞాపకశక్తి, రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఆకుకూరల్లో విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆకు కూరలు ఎక్కువగా తినాలని డాక్టర్లు చెప్తున్నారు. పాలకూర, పచ్చకూరల్లో బీకాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలు ముఖ్యంగా చర్మవ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి. 

ఇవి తినడం కళ్లకు కూడా చాలా మంచింది. చెడు కొలెస్ట్రాల్, రేచీకటి, అధిక రక్తపోటు, నిద్రలేమి, బట్టతల లాంటి సమస్యలకు గొంగూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. గొంగూరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెంతెం కూర రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లు ఎక్కువగా మెంతెం కూర రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కరివేపాకు వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

కరివేపాకుతో చేసే వంటలు తినడం వల్ల మలబద్దకం సమస్య దూరమవుతుంది. దీన్ని పొడిగా చేసుకొని అన్నంలో తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. పుదీనా వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉదయం లేవగానే పుదీన ఆకు తింటే.. గ్రాస్టిక్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పుదీన రసం తాగితే గొంతునొప్పి, తలనొప్పి తగ్గుతుంది. ఈ కూరలో అయినా కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. ఇది కూర రుచిని పెంచడమే కాదు మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. విరేచనాలతో బాధపడేవాళ్లు కొత్తమీర తింటే ఉపశమనం కలుగుతుంది.