టూల్స్​ & గాడ్జెట్స్ :​వావ్ అనిపించే ఫీచర్స్ తో.. స్మార్ట్ లాక్

ఇంటికి లాక్​ వేసుకుని ఆఫీస్​కు వెళ్లిపోయాక.. చెప్పకుండా చుట్టాలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ.. డోర్​కి ఈ స్మార్ట్​ లాక్​ ఉంటే ఆఫీస్​ నుంచే అన్​లాక్​ చేయొచ్చు. దీన్ని గోలెన్స్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ లాక్​ని ఫేస్​ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్, మొబైల్ యాప్, పాస్‌వర్డ్, ఆర్​ఎఫ్​ఐడీ కార్డ్, వర్చువల్ పాస్‌వర్డ్, ఓటీపీ, మెకానికల్ కీ.. ఇలా ఎనిమిది రకాలుగా అన్​లాక్​ చేయొచ్చు. 

ఇందులో హైక్వాలిటీ కెమెరా ఉంటుంది. అది అన్​లాక్​ చేసేటప్పుడు ముఖాలను ఈజీగా గుర్తిస్తుంది. ఇందులో వైఫై​ ఫీచర్​ కూడా ఉంది. దీంతో మనం ఎక్కడున్నా యాప్​ ద్వారా లాక్​ని యాక్సెస్​ చేయొచ్చు. ఇక ఇందులోని ​ స్మార్ట్ ఫింగర్​ ప్రింట్​ సెన్సర్​ 100 వేలిముద్రలను గుర్తించగలదు. మరో ప్రత్యేకత ఏంటంటే.. డోర్​ బెల్​ కూడా ఉంటుంది. ఎవరైనా బెల్​ కొడితే వెంటనే కెమెరా ఆన్​ అవుతుంది. డోర్​ లోపలి వైపు ఉన్న డిస్​ప్లేలో బెల్​ కొట్టినవాళ్ల వీడియో కనిపిస్తుంటుంది. దీన్ని ఇన్​స్టాల్​ చేయడం కూడా చాలా ఈజీ. ధర : 12,790 రూపాయలు