ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు క్యాండిడేట్లు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. ఓ పార్టీ క్యాండిడేట్ ఒక్కో ఓటరుకు వన్​టైమ్ సెటిల్​మెంట్​ కింద రూ.4 లక్షలు ముట్టజెప్పినట్టు తెలిసింది. మరో పార్టీ క్యాండిడేట్​ రూ.5 లక్షల దాకా ఒప్పుకుని రూ.2.5 లక్షలు మొదట ఇచ్చి, గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పినట్టు సమాచారం.

మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్​క్యాంపులో గందరగోళం నెలకొంది. క్యాంపులో ఉన్న కొందరికి పూర్తిస్థాయిలో డబ్బులు రాకపోవడంతో గురువారం ఓట్లు వేసేందుకు రామని మొండికేసినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీ క్యాండిడేట్​ వాళ్లను బుజ్జగించేందుకు రెండున్నర తులాల బరువు ఉన్న గోల్డ్​ కాయిన్స్​ను తెప్పించి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ గోల్డ్​ కాయిన్స్​కు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. 
-  వెలుగు, మహబూబ్ నగర్