పెళ్లిళ్ల సీజన్ భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవ్వరం చెప్పలేం.. మాఘ మాసం పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఇటీవల బంగారం ధరలు మూడు రోజుల పాటు తగ్గడంతో జనాలు కొనుగోళ్లు భారీగా చేశారు. తాజాగా ఈరోజు 2024 ఫిబ్రవరి 16 బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది.

నిన్నటి రేట్లతో పోలిస్తే.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరగడంతో రూ. 57, 100గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా రూ. 62, 290కి చేరింది. ఇక వెండి విషయానికి  వస్తే.. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది.. కిలో వెండి రూ. 1000 పెరగడంతో రూ. 77,000 గా ఉంది. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 62,290 లకు చేరింది. 

విజయవాడ..

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 62,290 లకు చేరింది. 

ఢిల్లీ..

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,440 గా ఉంది. 

ముంబై..

ముంబైలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 57,100 కాగా, అదే మొత్తంలో 24 క్యారెట్ల బంగారం విలువ రూ. 62,290.

చెన్నై..

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,600 కాగా, అదే మొత్తంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,840గా ఉంది.

ఫిబ్రవరి 16, 2024న వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. (రూ. 10 గ్రాములలో)

నగరం                  22 క్యారెట్ బంగారం ధర             24 క్యారెట్ల బంగారం ధర
అహ్మదాబాద్        57,150                                                62,340
కోల్‌కతా                 57,100                                                62,290
గురుగ్రామ్             57,250                                                62,440
లక్నో                     57,250                                                62,440
బెంగళూరు           57,100                                                 62,290
జైపూర్                   57,250                                                 62,440
పాట్నా                  57,150                                                  62,340
భువనేశ్వర్           57,100                                                  62,290